తిరుమల లో భక్తులకు భీమా సౌకర్యం!

👉 సహజ మరణం ₹ 2 లక్షలు, ప్రమాదవశాత్తు ₹ 3 లక్షలు !


J.SURENDER KUMAR,


భారత దేశంలోనే మొట్టమొదటిసారిగా, తిరుమలలో సహజ కారణాలతో మరణించిన యాత్రికులకు ₹ 2 లక్షల జీవిత బీమా కవరేజీని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు బుధవారం ఆమోదించింది. ఈ మొత్తాన్ని వారి కుటుంబాలకు చెల్లిస్తారు.

ఛైర్మన్ బి.ఆర్. నాయుడు అధ్యక్షతన, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎం. రవిచంద్ర సమక్షంలో జరిగిన బోర్డు సమావేశంలో, తిరుమలలో ప్రమాదాలలో మరణించిన భక్తుల కుటుంబాలకు ఇచ్చే ప్రమాద బీమాను .₹ 3 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచడానికి కూడా ఆమోదం తెలిపింది..