👉 బ్రాహ్మణ సంఘ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తా….!
J SURENDER KUMAR,
ధర్మపురి పట్టణ బ్రాహ్మణ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గుండి శంకర్ తో పాటు నూతన కార్యవర్గ సభ్యులు రాష్ట్ర సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.
ధర్మపురి లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం నూతనంగా ఎన్నికైన బ్రాహ్మణ సంఘం అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గంతో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షుడితో పాటు కార్యవర్గ సభ్యులను శాలువాలతో సన్మానించారు.
కార్యవర్గ సభ్యులు మంత్రి లక్ష్మణ్ కుమార్ ను శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందించి వేద ఆశీర్వచనం అందించారు.ఈ సందర్భంగా మంత్రి నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…..
ధర్మపురి క్షేత్ర సంప్రదాయాల పరిరక్షణతో పాటు బ్రాహ్మణ సమాజ అభివృద్ధి, సంక్షేమానికి తన వంతు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని, సంఘానికి, సంఘ భవనానికి చేయాల్సిన పనులు, కావలసిన నిధుల గూర్చి నివేదిక ఇవ్వండి అంటూ నూతన కార్యవర్గానికి మంత్రి సూచించారు.

మంత్రిని కలసిన వారిలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, సంగనభట్ల దినేష్, జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ భరత్, ఎన్నికల అధికారి రిటైర్డ్ ప్రిన్సిపాల్ పానుగంటి దత్తాత్రి, కాంగ్రెస్ నాయకులు సంగనభట్ల నరేందర్, జైస్కిరణ్ సుముఖ్, బ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులు ఒజ్జల నరేందర్, నూతన సంఘ ఉపాధ్యక్షులు బొజ్జ సంపత్ కుమార్, ప్రధాన కార్యదర్శి పురాణపు సాంబమూర్తి, కోశాధికారి ఒజ్జల దేవీప్రసాద్, సంయుక్త కార్యదర్శి శ్రీధర మహేష్‌తో పాటు బ్రాహ్మణ యువత, వేద పండితులు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు, తదితరులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
