J .SURENDER KUMAR,
భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మించనున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (NIUM) నూతన ప్రాంగణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ₹ 200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాంగణం కోసం ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో 20 ఎకరాల భూమి కేటాయించింది.
👉 2009లో జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునరుద్ధరణ మిషన్ (JNNURM) కింద ఎంపికైనప్పటికీ ఎన్ఐయూఎంకు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించని కారణంగా ఇంతకాలం వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో 20 ఎకరాలు కేటాయించింది.

👉 తెలంగాణలో పట్టణ విధానాల రూపకల్పనకు, కార్యాచరణ ఆధారిత పరిశోధన సంస్థగా ఎన్ఐయూఎం కీలకంగా పనిచేస్తుంది. 2028 జూన్ 2 నాటికి ప్రాంగణ నిర్మాణాన్ని పూర్తి చేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రారంభించుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
👉 ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
👉 అంతకుముందు ముఖ్యమంత్రి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) భవనాల నిర్మాణాలు, పరిసర ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
👉 ఫ్యూచర్ సిటీ లో పోలీస్ కమిషనరేట్ ప్రారంభం !

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పోలీస్ కమిషనర్ తరుణ్ జోషీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

👉 ఈ కార్యక్రమంలో ఎంపీలు వేం నరేందర్ రెడ్డి , మల్లు రవి , చామల కిరణ్ కుమార్ రెడ్డి , శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి , శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి , పలువురు ప్రజాప్రతినిధులు, డీజీపీ సీవీ ఆనంద్ , ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ జోషీ తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
