చండీ హోమంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి.!

J.SURENDER KUMAR,

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ధర్మపురి పట్టణంలోని భవానీ అమ్మవార్లను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రామలింగేశ్వర స్వామి ఆలయం, నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన చండీ హోమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి  అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు.

15వ వార్డు లో మహాకాళి అమ్మవారి నీ మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు

అనంతరం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి మంజూరైన వేతన పెంపునకు సంబంధించిన పత్రాలను మంత్రి అడ్లూరి అందజేశారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సేవలను గుర్తిస్తూ తగిన ప్రోత్సాహం అందించడం  నా ప్రభుత్వ ధ్యేయం  అని మంత్రి అన్నారు.

కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, ఈవో శ్రీనివాస్, దేవాలయ మాజీ చైర్మన్ జక్కు రవీందర్ మరియు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.