J.SURENDER KUMAR,
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ధర్మపురి పట్టణంలో వివిధ ప్రాంతాల్లో కొలువుదీరిన భవానీ అమ్మవార్లను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ శారదాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు కూరగాయల మార్కెట్ యార్డులో, న్యూ టీటీడీ కళ్యాణమండపం, తెలుగువాడలో కొలువుదీరిన అమ్మవార్లను మంత్రి దర్శించుకున్నారు.

ఈసందర్భంగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు మంత్రిని అమ్మవారి ప్రసాదం శేషాస్త్రం బహుకరించి ఆశీర్వదించారు.

