మృతుల కుటుంబాలకు మంత్రి అడ్లూరి ఆర్థిక సాయం.!

J.SURENDER KUMAR,

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కప్పర్రావుపేట గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కిషన్‌రావుపేట గ్రామానికి చెందిన శాతరాజుల కొమురయ్య, ముల్కల్ల శ్రీనివాస్ మృతి చెందారు. ఈ ఘటనపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు తన సిబ్బంది ద్వారా ఒక్కో కుటుంబానికి ₹10 వేల చొప్పున మొత్తం ₹ 20 వేల ఆర్థిక సాయం అందించారు. ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన మంత్రికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.