బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా గుండి శంకర్ !

J.SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడిగా గుండి శంకర్ ఎన్నికయ్యారు. బ్రాహ్మణ సంఘ భవనంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 719 ఓటర్లకు గాను, 4 68 ఓట్లు పోలయ్యాయి.

ఉపాధ్యక్షుడిగా బొజ్జ సంపత్ కుమార్ (ఫైల్ ఫోటో)
ప్రధాన కార్యదర్శి పురాణపు సాంబమూర్తి ( ఫైల్ ఫోటో)
నూతన కార్యవర్గాన్ని అభినందిస్తున్న యువత.


అధ్యక్ష పదవికి పోటీపడి విజయం సాధించిన గుండీ శంకర్ కు 265 ఓట్లు ఓడిన అభ్యర్థి ఇందారపు రామయ్యకు, 196 ఓట్లు వచ్చాయి. 7 ఓట్లు చెల్లలేదు.

సహాయ కార్యదర్శి శ్రీధరం మహేష్(ఫైల్ ఫోటో)
ఓట్లు వేయడానికి క్యూ లైన్ లో సభ్యులు( ఫైల్ ఫోటో)
కోశాధికారి ఓజ్జల దేవి ప్రసాద్ ( ఫైల్ ఫోటో)

ఉపాధ్యక్షుడిగా విజయం సాధించిన  బొజ్జ సంపత్ కుమార్ కు  274 ఓట్లు రాగా, పోటీపడిన ఓజ్జల ప్రవీణ్ శాస్త్రికి  182 ఓట్లు వచ్చాయి,  కార్యదర్శిగా విజయం సాధించిన పురాణపు సాంబమూర్తి కి 300 ఓట్లు రాగా,  పోటీపడిన మధుమహదేవకు 156 ఓట్లు వచ్చాయి.

సంఘ గౌరవ అధ్యక్షుడు ఓజ్జల నరేందర్ ,( ఫైల్ ఫోటో)


సహాయ కార్యదర్శిగా శ్రీధరం మహేష్, కోశాధికారిగా ఒజ్జల దేవి ప్రసాద్  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఎన్నికైన కార్యవర్గం ప్రమాణ స్వీకార  అనంతరం సంఘ గౌరవ అధ్యక్షుడిగా మాజీ వార్డు సభ్యుడు, ఒజ్జల నరేందర్ నియమించుకున్నారు.

ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రశాంతంగా ముగిసింది, మూడు గంటలకు ఓట్లు లెక్కింపు ప్రారంభించారు.

ఎన్నికల అధికారిగా రిటైర్డ్ ప్రిన్సిపాల్ పానుగంటి దత్తాత్రి, సహాయ అధికారిగా కాకేరి దత్తాత్రి, నిర్వాహకులుగా గొల్లపల్లి గుండయ్య, సంగనపట్ల నరహరి రావు ( దివాకర్) కొరిడే శంకర్, డి .నివాస్
సంఘనపట్ట నరసింహమూర్తి, బుగ్గారపు కిషోర్,  కాసర్ల వెంకటరమణ,  కష్జూల రాజేశ్వర శర్మ,( చిరంజీవి) ఇందారపు శంకర్ లు వ్యవహరించారు.

👉 నా శక్తి మేరకు సేవలందిస్తా – అధ్యక్షుడు గుండి శంకర్ !

నాపై నమ్మకం విశ్వాసంతో గెలుపును అందించిన
బ్రాహ్మణ  అభివృద్ధికి , నా శక్తి మేరకు సేవలు అందిస్తానని సంఘ అధ్యక్షుడు గుండి శంకర్, కృతజ్ఞతలు తెలుపుతూ, అన్నారు.  కార్యవర్గంతో పోటీ పడిన సోదరులు సంఘ అభివృద్ధికి సంక్షేమానికి ఇచ్చే సలహాలు సూచనలు స్వీకరించి  పనిచేస్తానని. సంఘ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం అవుదామని అధ్యక్షుడిగా  ప్రసంగంలో పేర్కొన్నారు.