అమ్మవారిని దర్శించుకున్న మంత్రి లక్ష్మణ్ కుమార్!


J SURENDER KUMAR,


దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు బుధవారం  మంత్రి లక్ష్మణ్ కుమార్ “కూష్మాండ”, “శాకాంబరి” రూపములలో గోదుమ రంగు చీరలో మల్లెపూలు, బిల్వపత్రి దండలు దరించిన  అమ్మవారిని దర్శించుకున్నారు.

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రధాన దేవాలయముతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో కలశస్థాపనలు, విశ్వక్షేన పూజలు, దీపారాదనలు జరిగాయి.


బుధవారం ఉదయము  వేదపండితులు, ఋత్వికులచే మహ సంకల్పము, పృద్వీకలశ, గణపతి పూజ, స్వస్తిఃపుణ్యహ వచనము, ఋత్విక్ వర్ణణము, అఖండ దీప స్థాపన, నవగ్రహ, వాస్తు, క్షేత్ర పాలక, యోగిని, అంకురారోపణ, మాతృక, సర్వతోభద్ర మండల పూజలు జరిగినవి. ఇందులో భాగంగా సప్తశతీ పారాయణము, అమ్మ వారికి చతుషష్ఠి పూజ. శ్రీచక్రమునకు కుంకుమార్చన, హారతి, మంత్రపుష్పము, తీర్థప్రసాద వితరణలు జరిగినవి మరియు ఐదు(5)ఋత్వికులచే “చండీపారాయణం” & “దేవిభాగవత పారాయణం”, కన్యకా, సువాసిని పూజలు జరిగాయి.


మంత్రి  లక్ష్మణ్ కుమార్ వెంట, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మీరాజేష్, జిల్లా గ్రంథాలయ చైర్మెన్  సంగనభట్ల దినేష్, కౌన్సిలర్  ఒజ్జల లక్ష్మణ్, చీపిరిశెట్టి రాజేష్, సంగి ఆనంద్, మాజీ చైర్మన్ జక్కు రవీందర్ సర్పంచులు ధర్మకర్తలు తదితరులు ఉన్నారు.

మహాశక్తి సేవ సమితి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించే మహా అన్నప్రసాదం  మంత్రి లక్ష్మణ్ కుమార్ ను కమిటీ సభ్యులు ఆహ్వానించారు.

👉 రాజారాంపల్లిలో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు!

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో  సర్పంచ్ సంగ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు గ్రామంలోని దేవి మండపం వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ఆడబిడ్డలందరికీ చీరలు, పసుపు, కుంకుమ, గాజులు అందజేసే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, రాష్ట్ర సీనియర్ నాయకులు మద్దుల గోపాల్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.


ఎండపల్లి మండల అధ్యక్షులు గెల్లు
చంద్ర శేఖర్  మండల ప్రధాన కార్యదర్శి కందికట్ల రాజేష్ , గాజుల లక్ష్మణ్ ,గెల్లు శ్రీనివాస్ , గాజుల విజయ్  పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు , రాజారంపల్లి గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.