సుదర్శన్‌ గౌడ్‌ కుటుంబానికి ₹6 లక్షల చెక్కును అందించిన మంత్రి అడ్లూరి!


👉 మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటాం.…!


J.SURENDER KUMAR,


రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జగిత్యాల జిల్లా హస్నాబాద్‌ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్‌ గౌడ్‌ కుటుంబ సభ్యులకు  వారి ఇంటికి వెళ్లి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  జగిత్యాల జిల్లా ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ప్రభుత్వ NRIఅడ్వైజరీ కమిటీ వైస్ ఛైర్మన్ భీమ్ రెడ్డి తో కలిసి బాధిత కుటుంబానికి అందజేశారు.


మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ప్రత్యేకంగా చొరవ తీసుకుని సుదర్శన్ గౌడ్ కుటుంబ పరిస్థితి ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో, సీఎం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి ₹ 6 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు


ఉపాధి కోసం సుమారు నాలుగు నెలల క్రితం ఉక్రెయిన్‌కు వెళ్లిన సుదర్శన్‌ గౌడ్‌.. అక్కడ కొనసాగుతున్న యుద్ధంలో క్షిపణులు, డ్రోన్‌ దాడుల నేపథ్యంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదర్శన్‌ గౌడ్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.