J.SURENDER KUMAR,
బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్-2026 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGFDC) చైర్మన్ దిల్ రాజు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ని కలిసిన వారిలో సినీ దర్శకుడు హరీష్ శంకర్ , తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ , గాయకుడు నల్గొండ గద్దర్ ఉన్నారు… శనివారం శిల్పకళా వేదికలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.
👉 సీఎంకు ఆహ్వానం…. !

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ దంపతులు జూబ్లీహిల్స్ నివాసంలో కలి తమ కుమార్తె కావ్య మారన్ వివాహ రిసెప్షన్ ఆహ్వానించారు. నవంబర్ 21న చెన్నైలో కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ వివాహ రిసెప్షన్ జరగనుంది.
