J.SURENDER KUMAR,
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ వేడుకలు న్యాయస్థానం , ఆరోగ్య, బ్యాంకు సంస్థలలోని మహిళా ఉద్యోగులు అంగరంగ వైభ వంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు..
ధర్మపురి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాయమూర్తి వై. జానకి హాజరై, న్యాయవాదులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు
ఈ పండుగ మహిళల ఐక్యతకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి పండుగలను కుటుంబ సమేతంగా జరుపుకోవడం ద్వారా మన సంప్రదాయాలను భావితరాలకు అందించాలని న్యాయమూర్తి జానకి అన్నారు.

ఈ కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి. రాజేశ్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బందేల రమేశ్, ఉపాధ్యక్షులు మామిడాల శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి రామడుగు రాజేశ్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ జాజాల రమేశ్, సీనియర్ న్యాయవాదులు గడ్డం సత్యనారాయణ, గడ్డం లింగారెడ్డి, రౌతు రాజేశ్, అలుక వినోద్, అప్పాల నిరంజన్ బత్తిని ఇంద్రకరణ్ సాంబరాజుల కార్తీక్ , కస్తూరి శరత్ కుమార్ కలమడుగు కీర్తి గడ్డం అనిల్ కలమడుగు హరిప్రసాద్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.
👉 ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో..

ధర్మపురి పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. వేడుకలకు ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన వేముల నాగలక్ష్మి పాల్గొని బతుకమ్మ ఆడారు.
బతుకమ్మ వేడుకను ప్రజలప్రాణాలు కాపాడే వైద్యుల ఆధ్వర్యంలో ఇతర వైద్య సిబ్బందిలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చైర్ పర్సన్ నాగలక్ష్మి అన్నారు.

కార్యక్రమంలో హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ రవి, ఆర్ఎంఓ రాజు . కౌన్సిలర్ కొమురల్లి పవన్ .ప్రముఖ గైనిక్ వైద్యురాలు డాక్టర్ స్వాతి, డాక్టర్ మానస. డాక్టర్ స్రవంతి. డాక్టర్ పూజ, డాక్టర్ వెంకటరమణ .హాస్పిటల్ సూపర్వైజర్ దేవ మరియు ఇతర వైద్య సిబ్బంది నర్సింగ్ ఆఫీసర్స్. హాస్పిటల్ శానిటైజేషన్ సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు. జరిగింది
👉 కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ !

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ మహిళా ఉద్యోగులు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. దాదాపు వంద మంది మహిళలు ఉద్యోగులు పాల్గొన్నారు.

ఉద్యోగ సంఘ నాయకుడు హనుమంతరావు, కార్యదర్శి రాజు, స్టేట్ మహిళా కార్యదర్శి స్రవంతి . జిల్లా కమిటీ సభ్యుడు మరియు సీఈవో ఎం సత్యనారాయణ రావు, బి శ్రీధర్, ఎండి రియాజ్ డీజీఎం రోహిణి, ఏటీఎం బ్యాంక్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
