బెస్ట్ అవలెబుల్ స్కూల్స్‌కు ₹40 కోట్ల నిధులు విడుదల.!

👉 రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన స్కూల్ యాజమాన్యలు. !


J.SURENDER KUMAR,


తెలంగాణ రాష్ట్రంలోని బెస్ట్ అవలెబుల్ స్కూల్స్‌కు ₹ 40 కోట్ల నిధులను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి స్కూల్ యాజమాన్యలు కృతజ్ఞతలు తెలిపాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క కి, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


అక్టోబర్ 2026 లో తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ (SC), ఎస్టీ (ST) సంక్షేమ శాఖల పరిధిలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని అమలు చేస్తున్న 225 కి పైగా ప్రైవేట్ పాఠశాలలకు బకాయిల కింద ₹ 40.68 కోట్లను విడుదల చేసింది.


ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 32,000 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు ఉచిత హాస్టల్ (వసతి) సౌకర్యాలు అందుతున్నాయి.

పాఠశాలలకు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను క్లియర్ చేయడం ద్వారా విద్యార్థుల చదువుకు, వసతికి ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. అని ఎస్సీ ఎస్టీ వివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అన్నారు ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మంత్రి కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు