ధర్మపురి బస్ స్టేషన్ కు మహర్దశ మంత్రి అడ్లూరి!

👉 25 న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధర్మపురికి..!

👉 ఆధునీకరణ పనుల శంకుస్థాపన  ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి  లక్ష్మణ్ కుమార్ ..!


J.SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్ స్టేషన్ కు మహర్దశ పట్టనున్నదని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆర్టీసీ అధికారులు, మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి మంత్రి గురువారం బస్ స్టేషన్ పరిశీలించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

ఈ నెల 25 న పట్టణంలోని స్థానిక బస్ స్టేషన్ ఆధునీకరణ పనులకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్  రానున్న నేపథ్యంలో . బస్ స్టేషన్‌లో చేపట్టనున్న ఆధునీకరణ పనులు, శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.

2027 లో జరగనున్న గోదావరి పుష్కరాలు నేపథ్యంలో బస్ స్టేషన్ లో మౌలిక వసతి సదుపాయాలు, ప్లాట్ ఫామ్ లో పెంచడం, తాగునీరు, వాష్ రూములు, కోట్లాది రూపాయలు నిధులతో చేపట్టనున్న పనులు గూర్చి మంత్రి సంబంధిత ఆర్టీసీ అధికారులతో, వయా నీకు లతో చర్చించారు.

కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.