కొడంగల్‌ లో సీఎం రేవంత్ రెడ్డి దసరా పండుగ వేడుకలు !

J.SURENDER KUMAR,


దసరా పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  కొడంగల్‌లోని తన నివాసంలో నియోజకవర్గ ప్రజలు, స్థానిక నాయకులతో ఆత్మీయంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు, నాయకులు ముఖ్యమంత్రి ని కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ముఖ్యమంత్రి  ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
పండుగ వేళ ప్రజలు, నాయకులతో సాగిన ఈ ఆత్మీయ కలయిక కొడంగల్‌లో పండుగ వాతావరణాన్ని మరింత సందడిగా మార్చింది
.

కొడంగల్‌లోని ప్రసిద్ధి చెందిన శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులను ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  పరిశీలించారు. పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దే పనులు కొనసాగుతున్నాయి.


ఆలయ పునర్నిర్మాణ పనులకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి  బాలాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.