నరసింహుని దర్శించుకున్న మంత్రులు పొన్నం అడ్లురి!

J.SURENDER KUMAR,


ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని, రాష్ట్ర రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి  అడ్లురి లక్ష్మణ్ కుమార్ ఆదివారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ముందుగా ఆలయ సాంప్రదాయ ప్రకారం మంత్రులకు,  మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలతో పూర్ణకుంభం స్వాగతం పలికారు. స్వామి దర్శనానంతరం  వేద పండితులు అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి  శ్రీ స్వామివారి శేష వస్త్రం, ప్రసాదం, చిత్రపటం  మంత్రి లక్ష్మణ్ కుమార్  మంత్రి ప్రభాకర్ గౌడ్ కు అందించారు. 

ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి,  కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ , జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్  సూపరింటెండెంట్ అల్వాల శ్రీనివాస్, వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , ఓంకార శర్మ , ముఖ్య అర్చకులు రమణయ్య , అర్చకులు నంబి నరసింహమూర్తి , చక్రపాణి కిరణ్ కుమార్ , అభిషేకం పురోహితులు బొజ్జా సంతోష్ కుమార్ , రాజగోపాల్ , సీనియర్ అసిస్టెంట్ వావిలాల తిరుపతి మరియు అర్చకులు సిబ్బంది, భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


👉 మంత్రులకు గౌరవ వందనం…!


మంత్రుల దర్శనానంతరం ఆలయ రాజగోపురం ముందు దారిలో పోలీస్ యంత్రాంగం మంత్రులకు గౌరవ వందనం ( గాడ్ ఆఫ్ ఆనర్ )  గావించారు.