పద్మశాలి సంఘానికి మంత్రి అడ్లూరి అభినందనలు !


J.SURENDER KUMAR,

ధర్మపురి  పట్టణంలో ఏకగ్రీవంగా ఎన్నికైన పద్మశాలి సేవా సంఘం నూతన కార్యవర్గ సభ్యులు ఆదివారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

సంఘం అధ్యక్షుడు గుడ్ల రవీందర్, ఉపాధ్యక్షుడు మేరుగు రమేష్, కోశాధికారి బైరి మల్లేశ్, కార్యదర్శి బోగా మల్లేశ్, సంయుక్త కార్యదర్శి వేముల రాజన్న, ఆడిటర్లు వెలగందుల బుచన్న, మేరుగు రామ్ చందర్ తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు మంత్రిని కలిశారు.

పద్మశాలి సేవా సంఘం అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి నూతన కార్యవర్గం సమన్వయంతో కృషి చేయాలని మంత్రి ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ధర్మపురి పట్టణ మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి రాజేష్, సంఘ నాయకులు, మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.