శ్రీధర్ కస్తూరి మా ప్రాంతం వాడు కావడం గర్వంగా ఉంది!

👉 ఆరోగ్య క్రిటికల్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వార్షికోత్సవంలో..!

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..!


J.SURENDER KUMAR,


ప్రఖ్యాత హృద్రోగ నిపుణులు డాక్టర్ శ్రీధర్ కస్తూరి మా ధర్మపురి నియోజకవర్గ ప్రాంతం వాడు కావడం, దేశవ్యాప్తంగా గొప్ప మానవీయ వైద్యుడిగా గుర్తింపు కలిగి ఉండడం నాకెంతో గర్వంగా ఉందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు..

ధర్మపురి పట్టణంలోని ప్రకృతి వెంచర్ లో ఆదివారం జరిగిన ఆరోగ్య క్రిటికల్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఐదవ వార్షికోత్సవ సందర్భంగా  ముఖ్య అతిథులుగా మంత్రి లక్ష్మణ్ కుమార్, డాక్టర్ శ్రీధర్ కస్తూరి  పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..!

ఆరోగ్య క్రిటికల్ కేర్ హాస్పిటల్ వారి సేవలను కొనియాడారు ఈ ప్రాంతానికి వారు చేస్తున్న వైద్య సేవల వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడబడుతున్నాయని , వారు మున్ముందు ఇలాంటి సేవలు మెరుగుపరుస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.  వైద్య పరిభాషలో రోగికి గోల్డెన్ అవర్  లో జగిత్యాల్ జిల్లా కేంద్రంలో ఆరోగ్య క్రిటికల్ కేర్ హాస్పిటల్ అందుబాటులో ఉండడం అభినందనీయం అన్నారు.

డాక్టర్ శ్రీధర్ కస్తూరి వైద్యపరంగా సామాజికపరంగా పేద ప్రజలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని సామాన్యుల పట్ల ఆయన స్పందిస్తున్న తీరు ఇతర వైద్యులకు ఆదర్శం కావాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆకాంక్షించారు.

👉 ఈ సందర్భంగా శ్రీధర్ కస్తూరి మాట్లాడుతూ……

ఆరోగ్య క్రిటికల్ కేర్ హాస్పిటల్ జగిత్యాల లాంటి పెద్ద పట్టణానికి అవసరమని అన్నారు . అలాగే వైద్యులకు పేషెంట్ మాత్రమే పరమావధి కావాలని , మానవత్వపు విలువలతో వైద్య వృత్తిని కొనసాగించాలని సూచించారు.


వైద్యుడికి రోగికి మధ్య మానవీయ ప్రేమానుబంధ సంబంధం ఉండాలని అప్పుడే రోగికి 50 శాతం వ్యాధి నయమవుతుందని శ్రీధర్ అన్నారు.
క్రిటికల్ కేర్ వైద్యులు తమ సెల్ ఫోన్ 24 గంటలు ఆన్ లో ఉండాలని,  అర్ధరాత్రి అపరారాత్రి  వచ్చే ప్రతి ఫోన్ కాల్ లిఫ్ట్ చేయాలని మనపై నమ్మకం విశ్వాసంతో ఫోన్లు చేస్తారని శ్రీధర్ వైద్యులకు సూచనలు చేశారు.


ఆరోగ్య హాస్పిటల్ లో చేరుతున్న కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆకాష్ శాస్త్రి తన వద్దనే శిక్షణ పొందాడని , అతను ఒక మంచి వైద్యుడిగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు .
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనపట్ల దినేష్, వైద్యులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.