ధర్మపురి రెవెన్యూ డివిజన్ కేంద్రం చేస్తాను.!

👉 మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ ..!

J SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రం, నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేస్తానని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి  అడ్లురి లక్ష్మణ్ కుమార్ అన్నారు..

ధర్మపురి పట్టణంలో ఆదివారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి బస్ స్టేషన్ ప్రాంగణంలో ₹ 2.57  కోట్ల నిధులతో చేపట్టనున్నవివిధ అభివృద్ధి పనులకు మంత్రులు భూమి పూజ చేశారు..

👉 ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…


2009 అసెంబ్లీ ఎన్నికల నుండి నాకు ధర్మపురి క్షేత్రంతో సంబంధం, బంధం, అనుబంధం ఉందన్నారు.  వరుస ఓటమి చెందిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి  దేవుడిపై పై  భారంతో ఉన్నానన్నారు..

👉 2023 ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో  ధర్మపురి లో డిగ్రీ కళాశాల మంజూరు,  మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో ధర్మారంలో పాలిటెక్నిక్ A I కళాశాల మంజూరు అయిందన్నారు రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మార్చడానికి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చేసిన విజ్ఞప్తి మేరకు డివిజన్ కేంద్రం మంజూరుకు స్పందించారు అని మంత్రి  అన్నారు.

👉 గత ప్రభుత్వంలో మూతపడిన స్థానిక శ్రీ లక్ష్మీనరసింహ సంస్కృత ఆంధ్ర కళాశాల ( నైట్ కాలేజ్) తెరిపించాను, నేరెళ్ల గ్రామంలో ₹ 200 కోట్ల నిధులతో 30 ఎకరాల స్థలంలో యంగ్ఇండియా విద్యా సంస్థ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.

👉 నియోజకవర్గంలో 90 శాతం వ్యవసాయదారిత ప్రజలు ఉన్నారని.  చివరి ఆయకట్టు భూములకు నిరంధించేందుకు రోళ్ళ వాగు,కాలేశ్వరం 2 తదితర సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగవంతం అయ్యాయి.అన్నారు.

👉 సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నూతనంగా రెవెన్యూ డివిజన్ కేంద్రాలు ప్రకటిస్తే అందులో మొదటి పేరు ధర్మపురిది ఉంటుందని బుగ్గారం మండల కేంద్రంలో కేంద్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు అని అన్నారు.

👉  పుష్కరాల అభివృద్ధికి ₹ 226 కోట్లు..!

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలోని పుణ్యక్షేత్రాలు, ఘాట్లు, రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

👉 ధర్మపురి ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ₹ 10 కోట్లు, పుష్కర ఘాట్లు, బైపాస్ రహదారులు తదితర అభివృద్ధి పనులకు సుమారు ₹226 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

👉ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారని, బస్‌స్టేషన్ ఆధునీకరణతో వారికి మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఆలయాలు, ఘాట్లు, రహదారుల అభివృద్ధితో పుష్కరాల సమయంలో భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించవచ్చని మంత్రి అన్నారు.