👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్…!
J .SURENDER KUMAR,
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేయూత పింఛన్లు అందజేస్తామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం ధర్మపురి నియోజకవర్గం బుగ్గారం మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల ప్రోసిడింగ్ లతో పాటు, కల్యాణ లక్ష్మి చెక్కులు, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంత్రి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….

.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు 200 యూనిట్లకు పేదల తరుపున ప్రభుత్వం కరెంట్ బిల్లు చెల్లిస్తుందని మంత్రి తెలిపారు. మహిళలు ఆర్టీసీలు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నా మని మంత్రి తెలిపారు.

👉 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నాలుగు గ్యారంటీలు అమలు చేశామని మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తామని మంత్రి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయూత పింఛను అందించి అండగా నిలవాలని ఉద్దేశంతో కొత్త పింఛన్లు మంజూరు చేశారని అన్నారు.
👉 బుగ్గారం మండలానికి కొత్తగా 338 చేయూత పింఛన్లు మంజూరు అయినట్లు మంత్రి తెలిపారు. మండలంలో అర్హత ఉన్న వారిని గుర్తించి పింఛన్లు విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు.

👉 బుగ్గారం మండలానికి 422 ఇందిర ఇళ్లను మంజూరు చేశామని మంత్రి తెలిపారు. మండలంలో అర్హత ఉన్న ఇందిరమ్మ ఇళ్ల ను అందజేస్తామని మంత్రి తెలిపారు.

👉 బుగ్గారం మండల అభివృద్ధి కి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మంత్రి ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.
బుగ్గారం మండల కేంద్రంలో నిర్మించిన పోచమ్మ ఫంక్షన్ హాల్ ని మంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు. కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
