J.SURENDER KUMAR,
ఐక్యరాజ్యసమితి (యూఎన్) జెనీవా కార్యాలయం డైరెక్టర్ జనరల్ హెచ్.ఈ. తత్యానా వలోవాయాతో శుక్రవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
తెలంగాణలో ఏఐ, పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణల అభివృద్ధి, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలు, యువతకు నైపుణ్య శిక్షణ, సుస్థిరాభివృద్ధిలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై చర్చించారు.
ఐక్యరాజ్యసమితి వేదికగా 1M1B ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు మంత్రి శ్రీధర్ బాబు అక్కడికి వెళ్లారు.
