👉 అభివృద్ధి కోసం మా కాంగ్రెస్ పార్టీలోకి రావడం సంతోషం. దమ్మన్నపేట, ఆత్మకూరు గ్రామ సర్పంచ్ లు చేరిక !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..!
J.SURENDER KUMAR,
గ్రామాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి మా కాంగ్రెస్ పార్టీలోకి సర్పంచులు రావడం సంతోషకరమని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దమ్మన్నపేట సర్పంచ్ ముదాం గౌతమి జానారెడ్డి, ఆత్మకూరు గ్రామ సర్పంచ్ దమ్మన్నపేట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా కండువాలు కప్పి మంత్రి లక్ష్మణ్ కుమార్ పార్టీలోకి ఆహ్వానించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ…

గత ప్రభుత్వ కాలంలో ఏనాడు ప్రజా సమస్యలు పట్టించుకోలేదని అన్నారు. 2014 నుండి 2023 వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నేనే రాజులం మేమే మంత్రులం అన్న చందంగా వ్యవహరించారని అన్నారు. బీఆర్ఎస్ పాలను గమనించిన ప్రజలు మార్పు కోరి ప్రజా ప్రభుత్వానికి అవకాశం కల్పించాలని మంత్రి తెలిపారు

👉 ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. రాష్ట్రంలో అర్హులైన వారికి రేషన్ కార్డులు అందించడంతో పాటు రేషన్ కార్డుల పై సన్న బియ్యం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు మంత్రి తెలిపారు.

👉 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రెండు గ్రామాల ప్రజల సర్పంచులు అభివృద్ధిని ఆకాంక్షించి కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని ఆహ్వానిస్తున్నామని మంత్రి తెలిపారు.
👉 రెండు గ్రామాల అభివృద్ధికి తన వంతుగా 100% కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సంక్షేమ పథకాలు అమలుకు ప్రత్యేక చొరవ తీసుకుంటానని మంత్రి తెలిపారు.

👉 అంతకు ముందు గొల్లపల్లి మండలం రంగధాంపల్లి గ్రామంలో నర్మెట్ల మౌనిక మహేష్ లకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని మంత్రి ప్రారంభించారు. రంగధాంపల్లి గ్రామానికి చెందిన ఎద్దు శంకరయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా శంకరయ్యను మంత్రి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు.
ఈకార్యక్రమంలో గొల్లపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బీమా సంతోష్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు నిశాంత్ రెడ్డి, మాజీ సింగల్ విండో చైర్మన్ కటారి చంద్రశేఖర్ రావు, రంగదాంపల్లి సర్పంచ్ అనిల్ తో పాటు గొల్లపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
