👉 ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్.!
J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్ మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం నుండి అయ్యప్ప స్వాములు నిత్య అన్నదానంను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….

మండలం లోని వివిధ గ్రామాల అయ్యప్ప స్వాములు, దీక్ష పరులైన అయ్యప్ప భక్తులు సంక్రాంతి వరకు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అడ్లూరి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వెల్గటూర్ మండల పార్టీ అధ్యక్షులు శైలేందర్ రెడ్డితో పాటు శ్రీకాంత్, మురళి తదితరులతో పాటు పలువురు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.
