👉 గురుకులాలను కాపాడలేని మీరు విద్యా వ్యవస్థపై మాట్లాడటం విడ్డూరం…!
👉 విలేకరుల సమావేశంలో గొల్లపల్లి మండల కాంగ్రెస్ నాయకులు!
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కొప్పుల ఈశ్వర్ తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలను గొల్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. మంగళవారం గొల్లపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాపెల్లి గంగన్న ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ,
ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను విమర్శించే ముందు కొప్పుల ఈశ్వర్ తన గత పాలనను, రాజకీయ వైఫల్యాలను ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.
👉 గురుకులాలను కాపాడలేని మీరు విద్యా వ్యవస్థపై విమర్శలా?
గొల్లపల్లి మండల కేంద్రంలో ఉన్న గురుకుల పాఠశాలను ధర్మపురి మండలం మగ్గిడి గ్రామానికి తరలించిన ఘనత మీ గత పాలనదే కాదా ? గొల్లపల్లి మండల కేంద్రంలో ఉన్న గురుకుల పాఠశాలను కాపాడలేని మీరు, ఈరోజు గురుకులాల గురించి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని నాయకులు ఆరోపించారు.
రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ వంటి విద్యా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుంటే వాటిపై విమర్శలు చేయడం మీ సంకుచిత రాజకీయ ఆలోచనలకు నిదర్శనమని మండిపడ్డారు.
కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా ప్రతి పేద బిడ్డకు సమాన విద్యా అవకాశాలు కల్పించి, ఉన్నత స్థాయికి ఎదిగేలా చేయడమే ప్రజా ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందితేనే సమాజంలో సమానత్వం, అభివృద్ధి సాధ్యమవుతాయని పేర్కొన్నారు.
👉 దొరల గడీల బానిసత్వం కాదు… ప్రజాస్వామ్య పాలనే మా నాయకుడి విధానం!
దొరల గడీల రాజకీయాలకు అలవాటుపడిన మనస్తత్వంతో, ప్రజాస్వామ్య పద్ధతిలో స్వతంత్రంగా ప్రజల కోసం పనిచేస్తున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ ను విమర్శించడం తగదని నాయకులు అన్నారు. మీ రాజకీయ విధానాలు మీకు ఉండవచ్చు. కానీ ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడిపై వ్యక్తిగత, అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు.
👉 ధర్మపురి నియోజకవర్గంలో మీ రాజకీయ పరిస్థితిపై ఆత్మపరిశీలన చేసుకోండి!
మున్సిపల్ ఎన్నికలు, గ్రామపంచాయతీ ఎన్నికలు, ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమిటో, ప్రజలు మీకు ఎలాంటి తీర్పు ఇచ్చారో ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్న రాజకీయ పరిస్థితులపై ఆత్మపరిశీలన చేసుకోకుండా ఇతర నాయకుల పనితీరుపై విమర్శలు చేయడం సరికాదన్నారు.
👉 ఇందిరమ్మ ఇళ్లు, సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాల్లో మార్పు!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, రైతు సంక్షేమం, మహిళా సంక్షేమం, విద్య, వైద్య రంగాల్లో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని నాయకులు తెలిపారు.
👉 ధర్మపురి నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, వివిధ సంక్షేమ పథకాల అమలు, గ్రామాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిపై అనవసర విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు.
👉 కేటీఆర్ మెప్పు కోసం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌పై విమర్శలా ?
రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో మీ రాజకీయ భవిష్యత్తు ఏమిటోననే ఆందోళనతో, గత పాలనలో జరిగిన వైఫల్యాల నేపథ్యంలో మీ పార్టీ నాయకత్వం మళ్లీ మీకు టికెట్ ఇస్తుందో లేదోననే అనుమానంతో, పార్టీ యువ నాయకుడు కేటీఆర్ గారి వద్ద మెప్పు పొందేందుకే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై విమర్శలు చేస్తున్నారా అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు.
👉 బడుగు, బలహీన వర్గాల గొంతుకగా నిలవాల్సిన మీరు, ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ వద్ద దళితులు నడిచిన నేలను పసుపు, నీలం రంగులతో ప్రక్షాళన చేసినట్లు అప్పట్లో వచ్చిన ఆరోపణలపై మీ వైఖరి ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన ఇలాంటి అంశాలపై ప్రశ్నించాల్సిన మీరు, వాటిని పట్టించుకోకుండా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను విమర్శించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.
👉 మీకు నిజంగా బడుగు, బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉంటే వారి హక్కులు, ఆత్మగౌరవం, విద్య, అభివృద్ధి కోసం పోరాడాలని సూచించారు. అంతేకానీ మీ రాజకీయ భవిష్యత్తు కోసం, కేటీఆర్ మెప్పు కోసం ప్రజల పక్షాన నిలబడుతున్న మా నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కేటీఆర్ మెప్పు కోసం రాజకీయాలు చేయడం కాదు, ప్రజల కోసం పనిచేయడమే నిజమైన రాజకీయ నాయకుడి లక్షణమని స్పష్టం చేశారు.
👉 ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిగా ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేయాలి కానీ, కేవలం రాజకీయ ఉనికిని చాటుకోవడానికి, పార్టీ నాయకుల మెప్పు పొందడానికి అసత్య, అనుచిత విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు.
ఇకనైనా వ్యక్తిగత విమర్శలు మానుకొని ప్రజా సమస్యలపై మాట్లాడాలని, ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై నిర్మాణాత్మకంగా స్పందించాలని సూచించారు. లేనిపక్షంలో ధర్మపురి నియోజకవర్గ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.
విలేకరుల సమావేశంలో …

మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమసంతోష్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చిర్రా దిలీప్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దాసరి తిరుపతిగౌడ్, మండల ప్రధాన కార్యదర్శి జెల్ల అనిల్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పురం శెట్టి గౌతం, టౌన్ ప్రెసిడెంట్ నేరెళ్ల మహేష్, వివిధ గ్రామాల సర్పంచులు మేక స్వామి, ముల్కాల శ్రీనివాస్ శిరీష, కాసా అంజలి గంగాధర్, కాసారపు భవాని అరవింద్ గౌడ్, ముధం గౌతమిజానారెడ్డి, గంగారం, కంకనాల వసంత లక్ష్మణ్, కె.జలంధర్ ఓ.తిరుపతి,రామ్ రెడ్డి, రాజేశ్వర్, భూమ గౌడ్, జమలాకర్, సుమన్ గౌడ్, పావని దస్తగిరి, రాజం, తిరుపతి, శ్రీలత గంగా చారి, రాజశేఖర్, ఉపసర్పంచులు గురజాల బుచ్చిరెడ్డి, తిరుపతి, మాజీ సర్పంచులు సత్యనారాయణ గౌడ్, చిర్ర గంగాధర్, తిరుపతి రెడ్డి, మాజీ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి, బాబు, శంకర్, రాజారావు, రామ్మోహన్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
