J.SURENDER KUMAR,
కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి నీ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.



అనంతరం బ్రహ్మ పుష్కరిణి (కోనేరు)లో నిర్వహించిన పంచ సహస్ర దీపాలంకరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి, కౌన్సిలర్లు తదితర నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.
