సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర..!

J.SURENDER KUMAR,

కొడంగల్ నియోజకవర్గంలోని పోలేపల్లి ఎల్లమ్మ ఆలయం నుంచి లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ వరకు సోమవారం నిర్వహించిన పాదయాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పాల్గొన్నారు.


వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లిలోని రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో సీఎం  ప్రత్యేక పూజలు చేశారు.  కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో రైతన్నతో ఆత్మీయ సభకు పాదయాత్రగా బయలుదేరే ముందు ముఖ్యమంత్రి  పోలేపల్లి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.


లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ ఆవరణలో ఏర్పాటు చేసిన రైతన్న ఆత్మీయ సభలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి  పోలేపల్లి ఎల్లమ్మ ఆలయం నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులు, రైతులు, స్థానికులతో కలిసి పాదయాత్రగా బయలుదేరారు.

మంత్రులు దామోదర రాజనర్సింహ , జూపల్లి కృష్ణారావు , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , వాకిటి శ్రీహరి , వివేక్ వెంకటస్వామి , మహమ్మద్ అజారుద్దీన్ , ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి తో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.