వేల కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ!

👉 కొడంగల్ నియోజకవర్గంలో…!


J.SURENDER KUMAR,


కొడంగల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  తన పర్యటన మూడో రోజున ₹ 9,053.48 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 13 కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

👉 వీటిలో ప్రధానంగా రహదారులు, సాగునీరు, విద్య, వ్యవసాయం, రవాణా, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు పెద్దపీట వేస్తూ కొడంగల్ ప్రాంత అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేశారు.

👉 మౌలిక వసతుల విస్తరణతో పాటు విద్య, ఉపాధి, వ్యవసాయ రంగాల్లో అవకాశాలను పెంపొందించేలా చేపట్టిన ఈ ప్రాజెక్టులు నియోజకవర్గ భవిష్యత్ అభివృద్ధికి కీలకంగా నిలవనున్నాయి.

👉 ముఖ్యమంత్రి  శంకుస్థాపన చేసిన పనుల వివరాలు:

☝️ కొత్వాల్ గూడ నుంచి నాచారం వరకు ₹ 5,060 కోట్లతో రేడియల్ రోడ్డు -2 నిర్మాణం.

☝️ ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద ₹1,410 కోట్లతో 223 కొత్త బీటీ రహదారులు, అసంపూర్తి రహదారుల పనులు.

☝️ ₹ 2,100 కోట్లతో మక్తల్ – నారాయణపేట్ – కొడంగల్ లిఫ్ట్ (#MNKLIS) రెండో దశ పనుల ప్రారంభం.

☝️ విద్యా రంగంలో ₹ 118.80 కోట్లతో 10 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు,

☝️ ₹123 కోట్లతో కొడంగల్‌లో వ్యవసాయ కళాశాల నిర్మాణం.

☝️ ₹ 41.83 కోట్లతో కొడంగల్, కోస్గి, మద్దూరులో ఆధునిక బస్టాండ్లు,

☝️ ₹ 20 కోట్లతో మద్దూరులో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (NAC) స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్.

☝️ ₹ 20 కోట్లతో సమీకృత డివిజనల్ కార్యాలయ సముదాయం.

☝️ ₹ 59.30 కోట్లతో రహదారుల నిర్మాణ పనులు.

☝️ తిమ్మారెడ్డిపల్లిలో ₹ 4.45 కోట్లతో గురులోక మసంద్ ప్రభు మందిరం అభివృద్ధి.

☝️ కొడంగల్‌లో ₹ 5.10 కోట్లతో నిరంజన్ మఠం అభివృద్ధి పనులు.

☝️ హకీంపేట ఇండస్ట్రియల్ కారిడార్‌లో ₹ 10 కోట్లతో పర్యాటక హోటల్ నిర్మాణం.

☝️ ₹ 81 కోట్లతో ఎకోపామ్ పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం.