J.SURENDER KUMAR,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని స్వతంత్ర మైక్రోఫిన్ చైర్‌పర్సన్, యువ పారిశ్రామికవేత్త అనన్య బిర్లా శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి ని ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో కలిసిన అనన్య చర్చల సందర్భంగా తెలంగాణ రైజింగ్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారు.
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అనన్య బిర్లా ని ఆహ్వానించారు. తెలంగాణలో పెట్టుబడులకు అనన్య ఆసక్తిని వ్యక్తీకరించారు.
