ధన్వాడ లో స్వామీజీ కి ఘన స్వాగతం !

👉 మంత్రి శ్రీధర్ బాబు నివాసానికి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ.


J.SURENDER KUMAR,

అవధూత దత్త పీఠం మైసూర్ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆదివారం ధన్వాడ మంథని కి వచ్చిన సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు, స్వామి వారికి అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు.

మంత్రితో పాటు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ దంపతులు, మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ సతీమణి, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్‌, రామగుండం పోలీస్ కమిషనర్, స్థానిక ఆధ్యాత్మికవేత్తలు, రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, భక్తులు
ప్రభుత్వ యంత్రాంగం ఘన స్వాగతం పలికారు మహిళలు మంగళహారతులతో కోలాటాలతో స్వామివారికి స్వాగతం పలికారు
.

ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ధన్వాడ గ్రామానికి చేరుకున్న అవధూత దత్త పీఠం మైసూర్ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీకి పూర్ణకుంభ స్వాగతం పలికి న రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు ధన్వాడ లోని తమ నివాసానికి స్వాగతించారు.

ఈ సందర్భంగా మంత్రి మాతృమూర్తి జయశ్రీ , కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీకి ప్రత్యేక పాద పూజలు నిర్వహించి స్వామీజీ ఆశీస్సులు పొందారు.


అనంతరం ధన్వాడలోని దత్తాత్రేయ స్వామి ఆలయంకు వెళ్లిన శ్రీ సచ్చితానంద స్వామీజీ, దత్తాత్రేయుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో లోకకల్యాణార్థం నిర్వహించిన మహాపూర్ణాహుతి యజ్ఞంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామీజీ భక్తులను ఉద్దేశించి దివ్య ప్రవచనం చేశారు.