శ్రీ శ్రీ శ్రీ గణపతి స్వామిజీ రాకతో పులకించిన మంథని గడ్డ!

👉 మంథని ప్రాంతంలో స్వామివారు అడుగుపెట్టడం గొప్ప అదృష్టం !

👉 రెండుమూడేళ్ల నిరీక్షణ ఫలించింది !

👉 ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు !


J.SURENDER KUMAR,

శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు మంథని, ధన్వాడ ప్రాంతంలో అడుగుపెట్టడం. “స్వామివారి దర్శన భాగ్యం లభించాలంటే ఎన్నో ఏళ్లు నిరీక్షించాల్సి వస్తుంది. ఒక్క క్షణం, రెండు క్షణాలు స్వామివారి దివ్య ఆశీస్సులు పొందే అవకాశం లభించడం కూడా గొప్ప అదృష్టం. అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు భావోద్వేగంగా మాట్లాడారు.

ధన్వాడలో కార్యక్రమం అనంతరం స్వామీజీ రోడ్డు మార్గంలో మంథనికి చేరుకున్నారు. అక్కడి శివకిరణ్‌ గార్డెన్స్‌లో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు దర్శనమిచ్చి, వారిని ఉద్దేశించి ప్రసంగించారు. స్వామివారి రాకతో మంథని ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు పొందారు.

👉 గత రెండుమూడేళ్లుగా మా అమ్మ జయశ్రీ, నా సతీమణి, కుటుంబ సభ్యులు స్వామివారు ఈ ప్రాంతానికి వచ్చి ప్రజలకు ఆశీర్వచనాలు అందించాలని కోరుకుంటున్నాం. ఇన్ని రోజుల నిరీక్షణకు నేడు ఫలితం దక్కింది” అని మంత్రి పేర్కొన్నారు.


👉 ధన్వాడలో దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని స్థాపించుకున్న తర్వాత స్వామివారు అక్కడికి విచ్చేసి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప విశేషమని మంత్రి అన్నారు.

👉 ఈ ప్రాంత ప్రజలకు శుభాశీస్సులు ఆశీర్వచనాలు అందించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రముఖులు జిల్లా ఎస్పీ కలెక్టర్ ప్రజలు భక్తులు వేలాదిగా తరలివచ్చి పాల్గొనడం అభినందనీయమన్నారు. స్వామివారి పాదాలకు నమస్కరించి, మంథని ప్రజల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

👉 ప్రజల కష్టాలు తొలగి.. సుఖసంతోషాలతో వర్ధిల్లాలి!

స్వామివారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలు, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రజలు, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల ప్రజలు, ముఖ్యంగా మంథని, ధన్వాడ ప్రాంత ప్రజలు సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రజల కష్టాలు తొలగిపోయి, అందరూ బాగుండాలని, ప్రశాంతంగా జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

👉 స్వామివారి దివ్య ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలకు మంచి జరుగుతుందని, ఎన్ని కష్టాలు ఎదురైనా దత్తాత్రేయ స్వామివారి ఆశీస్సులతో వాటిని అధిగమించగలమనే విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఎల్లప్పుడు మంథని ప్రాంతం పై స్వామివారి ఆశీస్సులు ఆశీర్వాదం ఉంటాయని మంత్రి తెలిపారు. స్వామి వారికి అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ దంపతులు, మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ సతీమణి, జిల్లా కలెక్టర్‌ రామగుండం పోలీస్ కమిషనర్, స్థానిక ఆధ్యాత్మికవేత్తలు, రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.