👉 భగవంతుడు సర్వాంతర్యామి….
👉 నిస్వార్థంగా కోరుకున్న కోరికలు తీరుస్తాడు .
👉 ధన్వాడ, మంథనిలో …
👉 శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ దివ్య ప్రవచనం !
J.SURENDER KUMAR,
భగవంతుడు సర్వాంతర్యామి. అనేక రూపాలు.. కోటానుకోట్ల పేర్లు. ఏ విధంగా స్మరించినా భక్తులకు కనిపించి, వారి కోరికలు తీరుస్తారని, భక్తి మార్గంలో నడిస్తే.. ధర్మమే మనల్ని రక్షిస్తుంది అని అవధూత దత్త పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. అయితే ఆ కోరికలు నిస్వార్థమైనవిగా, సహేతుకమైనవిగా ఉండాలని ప్రవచించారు.
ఆదివారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆహ్వానం మేరకు ధన్వాడ, మంథనిలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులను ఉద్దేశించి స్వామీజీ ప్రసంగించారు. భగవంతుడిని నిస్వార్థంగా స్మరిస్తూ, ధర్మాన్ని ఆచరిస్తే జీవితంలో విజయం సాధించవచ్చని, మానవసేవే మాధవసేవగా భావించి అహింసా మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు.

👉 భగవంతుడికి జయం అక్కర్లేదు.. భక్తులకు విజయాన్ని ప్రసాదిస్తారు.!
☝️భగవంతుడు ఎక్కడో లేడని, మన హృదయాల్లోనే కొలువై ఉంటాడని స్వామీజీ పేర్కొన్నారు. మనం భగవంతుడిని పూలతో పూజించి, నైవేద్యం సమర్పిస్తామని, భక్తితో సమర్పించిన నైవేద్యాన్ని భగవంతుడు సూక్ష్మరూపంలో ఆరగిస్తారని వివరించారు. భగవంతుడికి జయం అవసరం లేదని, ఆయనను విశ్వసించే భక్తులకు విజయాన్ని అందిస్తారని అన్నారు.
☝️భగవంతుడిని కుటుంబ సభ్యుడిగా భావించి, మనస్ఫూర్తిగా ఆరాధించాలని సూచించారు. కోరికలు కోరడంలోనూ నిస్వార్థం, సహేతుకత ఉండాలని హితవు పలికారు. మనిషి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భగవంతునిపై విశ్వాసాన్ని కోల్పోకూడదని, ధర్మాన్ని పాటిస్తూ ముందుకు సాగాలని చెప్పారు.
👉 బ్రిటిష్ కాలం నాటి తిరుపతి కథను వివరించిన స్వామీజీ!

భగవంతుడి మహిమను వివరిస్తూ బ్రిటిష్ పాలన కాలంలో తిరుపతిలో జరిగిన ఒక కథను స్వామీజీ భక్తులకు వివరించారు. అప్పట్లో తిరుమల శ్రీవారికి నైవేద్యం సమర్పించే అర్చకులు, దేవుడికి సమర్పించిన నైవేద్యాన్ని వారే తింటున్నారని ఒక కలెక్టర్ అనుమానించినట్లు తెలిపారు.
☝️ఈ విషయాన్ని నిరూపించాలనే సంకల్పంతో ప్రధాన అర్చకుడు, ఇతర అర్చకులతో కలిసి కలెక్టర్ సమక్షంలోనే నైవేద్యాన్ని సమర్పించారని చెప్పారు. తెర లేకుండా పూజలు నిర్వహించిన అనంతరం నైవేద్యాన్ని కలెక్టర్ ముందు ఉంచగా, ముందుగా సమర్పించిన ఆహారానికి, తర్వాత తీసుకొచ్చిన నైవేద్యానికి తేడా కనిపించిందని వివరించారు.
☝️ఈ ఘటనతో భగవంతుడి మహిమను గుర్తించిన కలెక్టర్ అర్చకులను అభినందించారని స్వామీజీ పేర్కొన్నారు. భగవంతుడి లీలలు అపారమని, ఆయన సర్వాంతర్యామి అని ఈ కథనం ద్వారా వివరించారు. స్వామివారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో ధన్వాడ మంథని కి భక్తజనం పోటెత్తారు.


ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ మక్కాన్‌సింగ్ దంపతులు, మంత్రి లక్ష్మణ్‌కుమార్ సతీమణి, విజయ క్రాంతి దినపత్రిక సీఎం డి సి.ఎల్ రాజం, యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ వాళ్ల కవర్గ ధర్మకర్ధం చిల్లప్ప గారి విజయ కలెక్టర్, రామగుండం. పోలీస్ కమిషనర్, స్థానిక ఆధ్యాత్మికవేత్తలు, రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
