👉 తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ విజ్ఞప్తి..
J.SURENDER KUMAR,
తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతితో పాటు అజ్ఞాతంలో ఉన్న మరో ఇద్దరు అగ్రనేతలను అజ్ఞాతమును ఆయుధాలు వీడి తెలంగాణ ప్రభుత్వ గడపలోకి (జనజీవన స్రవంతిలోకి ) రావాలని విజ్ఞప్తి చేశారు
హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో గతంలో లొంగిపోయిన 214 మంది మావోయిస్టులకు సోమవారం ₹5.59 కోట్ల పునరావాస ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా డీజీపీ ఈ కీలక విజ్ఞప్తి చేశారు

. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముగ్గురు మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని, వారిలో గణపతి (ముప్పాళ్ల లక్ష్మణరావు), జోడే రత్నబాయి, వార్త శేఖర్ ఉన్నారని డీజీపీ తెలిపారు.
వారు ఎక్కడ ఉన్నారో, జీవించి ఉన్నారో లేదో స్పష్టమైన సమాచారం లేదని, అయినప్పటికీ లొంగిపోతే పోలీసులు తగిన రక్షణ కల్పించడంతో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని రకాల పునరావాస ప్రయోజనాలు, వైద్య సాయం అందిస్తామని డీజీపీ హామీ ఇచ్చారు.
👉 గణపతి ఎక్కడ.. ?

ప్రభుత్వానికి లొంగిపోయిన మావోయిస్టు అగ్ర నేతలు కేంద్ర కమిటీ, వివిధ కమిటీల దళ నాయకులు ఆయా ప్రభుత్వాలకు ఇచ్చిన సమాచారం మేరకు అడవుల్లోని ఆయుధాల డంపులను భద్రత దళాలు వెలికి తీస్తున్న విషయం తెలిసిందే.
నంబాల కేశవరావు మావోయిస్టు సెక్రెటరీ జనరల్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తరువాత ఆగస్టు 2025లో జరిగిన సిసి మీటింగ్ లో ( సెంట్రల్ కమిటీ ) ముప్పల లక్ష్మణరావు @ గణపతి పాల్గొన్నట్టు ఆయా ప్రభుత్వాల వద్ద ఖచ్చితమైన సమాచారం ఉంది.
దండకారణ్యంలో జరిగిన సి సి మీటింగ్ తర్వాత గణపతి తో పాటు ఆయన భార్య మరో అంగరక్షకుడు వార్త శేఖర్ ఆచూకీ కోసం కేంద్ర ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారి లొంగుబాటుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం గణపతిని జనజీవన స్రవంతిలోకి రావాలని, అనారోగ్య భారీన పడి ఉంటే కార్పొరేట్ వైద్య సేవలు ప్రభుత్వపరంగా అందిస్తామని పలుమార్లు విజ్ఞప్తి చేసిన తెలిసిందే.
