హరీష్ రావు ధర్మపురి ప్రజలకు ఎందుకు అన్యాయం చేశావు !

👉 మేడారం రిజర్వాయర్ నుండి సాగునీటిని ఇచ్చే ఆలోచన ఎందుకు చేయలేదు..?

👉 అసెంబ్లీలో కాళేశ్వరం పై చర్చలో ఎందుకు పాల్గొనలేదు..?

👉 అసెంబ్లీ సాక్షిగా పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తానని ఎందుకు నిర్మించలేదు ?

👉 ముఖ్యమంత్రి  పట్ల అవహేళన చేసినట్లు మాట్లాడితే ఊరుకోం.!


👉 విలేకరుల సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలో నిర్మించిన రిజర్వాయర్ నుండి ధర్మపురి నియోజకవర్గ రైతులకు  సాగునీటిని ఎందుకు అందించలేదు ? . ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు ఎందుకు అన్యాయం చేశావు.? మాజీ నీటిపారుదల మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సమాధానం చెప్పాలి అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ ధ్వజమెత్తారు.  రాష్ట్ర ముఖ్యమంత్రిని అవహేళన చేసినట్టు మరో మారు హరీష్ రావు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని మంత్రి తీవ్ర ఆగ్రహంతో హెచ్చరించారు.

బుధవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం లోని  నంది రిజర్వాయర్ వద్ద మంత్రి లక్ష్మణ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు.

👉  ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

కృష్ణా జలాలలో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని హరీష్ రావు ఆరోపిస్తున్నారని అయితే ధర్మపురి నియోజకవర్గంలో నిర్మించిన మేడారం రిజర్వాయర్ నుండి ధర్మపురి నియోజకవర్గానికి ఎందుకు సాగునీటిని అందించలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. ధర్మపురి నియోజకవర్గ ప్రజలు ఏమీ అన్యాయం చేశారని మేడారం నుండి మిడ్ మానేరు ద్వారా సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కు నీటిని తరలించుకు వెళ్లారని మంత్రి అన్నారు.


👉 కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ప్రధాన బ్యారేజ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్క ఎకరానికి సాగునీరు ఇవ్వలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తానని మాట ఇచ్చిన కేసీఆర్ ఆ మాట మరిచి ధర్మపురి నియోజకవర్గ రైతాంగానికి తీవ్ర అన్యాయం చేశారని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.


👉 హరీష్ రావు అన్ని తెలిసిన ఇంజనీర్ల మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉత్తర, దక్షిణ తెలంగాణలకు తెలంగాణకు అన్యాయం చేసిన హరీష్ రావు కు ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ పెడితే చర్చలో పాల్గొనకుండా పారిపోయారని మంత్రి లక్ష్మణ్ గుర్తు చేశారు.


👉 బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించారు తప్ప నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదని. మంత్రి ఆరోపించారు.  మేడారం రిజర్వాయర్ నుండి అదనపు టిఎంసి నీటిని తీసుకోవడమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  లక్ష్యమని మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. మేడారం రిజర్వాయర్ కు బఫర్ జోన్ పరిధిలో ఉన్న చామనపల్లి గ్రామాన్ని 100% ముంపు గ్రామంలో తీసుకొని ₹ 350 కోట్లు విడుదల చేశామని మంత్రి తెలిపారు.


👉 తెలంగాణలో ప్రజా ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక హరీష్ రావు ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. కడుపునిండా కుట్రలు పెట్టుకుని హరీష్ రావు తన ఆవ భావాలతో వ్యంగ్యంగా ముఖ్యమంత్రి పై విమర్శలు చేస్తున్నారని  మరో మారు ముఖ్యమంత్రి  గూర్చి వ్యంగంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.


👉 ధర్మపురి నియోజకవర్గ సాగునీటి అవసరాలు తీర్చు తాము..

టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ధర్మపురి నియోజకవర్గానికి జరిగిన అన్యాయాన్ని ప్రజా ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నాయకత్వంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి  సహకారంతో తీర్చుతామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. నియోజకవర్గంలోని మారేడుపల్లి, మారేడుపల్లి గ్రామాలకి 17 ఎల్ కాలువ ద్వారా తాగునీటిని అందించడానికి చర్యలు తీసుకుంటూ మంత్లీ తెలిపారు.


👉 గొల్లపల్లి మండలం రంగధామునిపల్లి అభివృద్ధి చేసి ప్రత్యేక కాలువ ద్వారా చిలుక కోడూరు చెరువు నుండి జంగల్ నాలా ప్రాజెక్టుకు నీటిని తరలించి ధర్మపురి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.


👉 సంక్రాంతి నుండి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ఇచ్చిన ప్రతి మి నిలబెట్టుకుంటామని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

కార్యక్రమంలో ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రూప్ల నాయక్, మేడారం సర్పంచ్ వీర్ పాల్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడి రంజిత్ తో పాటు ధర్మారం మండల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.