👉 సందీప్ నియామకం పట్ల సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలకు కృతజ్ఞతలు !
👉 మీనాక్షి నటరాజన్ నాయకత్వంలో కాంగ్రెస్ సాధించిన విజయాలు అభినందనీయం !
👉 టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.!
J.SURENDER KUMAR,
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్‌చార్జిగా నియమితులైన బీఎం సందీప్‌కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హృదయపూర్వక స్వాగతం పలికారు. ఆయన నియామకం పట్ల ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
గాంధీ భవన్‌లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…
గతంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహించిన మీనాక్షి నటరాజన్ నాయకత్వంలో జరిగిన ఉపఎన్నికలు, గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయని మంత్రి పేర్కొన్నారు.

👉 ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ సంస్థాగత కార్యకలాపాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.

👉 పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్యకర్తలకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత కల్పించాలని పేర్కొన్నారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు సహా స్థానిక సంస్థల్లో ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
👉 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, దివ్యాంగులు, మహిళలు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్‌ల సంక్షేమం, సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వివరించారు. విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక భద్రత, సంక్షేమ రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, సాధిస్తున్న ఫలితాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
👉 సమావేశంలో ప్రజాపాలన ప్రభుత్వ మూడేళ్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష, పార్టీ సంస్థాగత బలోపేతానికి చేపట్టిన సంఘటన్ సృజన్ అభియాన్, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), పార్టీ కమిటీల నియామకాలు, సంస్థాగత బాధ్యతలు, ప్రభుత్వానికి పార్టీ నాయకత్వానికి మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించారు.
👉 రాబోయే రాజకీయ సవాళ్లను ఐక్యతతో ఎదుర్కొంటూ, పార్టీ అధిష్ఠానం మార్గదర్శకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు.
