👉 నవంబర్ 30న కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.. నాచుపల్లి జేఎన్టీయూలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం!
J.SURENDER KUMAR,
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ఈ నెల 30వ తేదీన (సోమవారం) జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలోని మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో ఉన్న కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
అనంతరం కొడిమ్యాల మండలం నాచుపల్లిలోని జేఎన్టీయూలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ లతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
👉 గవర్నర్ పర్యటన షెడ్యూల్ వివరాలు:
గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా తన సతీమణి శ్రీమతి జానకి శుక్లా, అధికారిక సిబ్బందితో కలిసి నవంబర్ 30వ తేదీ ఉదయం 9:20 గంటలకు హైదరాబాద్‌లోని లోక్‌భవన్ నుంచి బయలుదేరి 9:30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
👉 అక్కడి నుంచి ఉదయం 9:40 గంటలకు హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 10:30 గంటలకు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లిలోని జేఎన్టీయూ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
👉 అనంతరం ఉదయం 10:35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 10:45 గంటలకు మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి చేరుకుంటారు.
👉 ఉదయం 10:45 నుంచి 11:30 గంటల వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, ఆశీర్వచనం, సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు.
👉 ఉదయం 11:30 గంటలకు ఆలయం నుంచి బయలుదేరి 11:40 గంటలకు నాచుపల్లిలోని జేఎన్టీయూకు చేరుకుంటారు. ఉదయం 11:40 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు ఇతర జిల్లా అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు.
👉 అనంతరం మధ్యాహ్నం 12:45 నుంచి 1:30 గంటల వరకు భోజన విరామం.
👉 మధ్యాహ్నం 1:30 గంటలకు నాచుపల్లి జేఎన్టీయూ హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 2:20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
👉 అక్కడి నుంచి 2:25 గంటలకు బయలుదేరి 2:35 గంటలకు హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌కు చేరుకుంటారు.
👉 గవర్నర్ శివ ప్రకాష్ శుక్లాతోపాటు… హెలికాప్టర్ లో..

గవర్నర్ ఆయన సతీమణి. శ్రీమతి జానకి శుక్ల,
సీనియర్ ఐఏఎస్ అధికారి గవర్నర్ చీఫ్ స్పెషల్ సెక్రటరీ దాన కిషోర్. స్క్వాడ్ హరిశ్చంద్ర గవర్నర్ ఏ డి సి, గవర్నర్ సి ఎస్ ఓ మట్టయ్య, గవర్నర్ పర్సనల్ సెక్రెటరీ సుధీర్ కుమార్ జైస్వాల్. గవర్నర్ వెంట హెలికాప్టర్ లో రానున్నారు. గవర్నర్ ప్రెస్ సెక్రటరీ, ఎం దశరథం, 29 న సాయంత్రం కొండగట్టుకు చేరుకోనున్నారు.
