👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..!
J.SURENDER KUMAR,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట ప్రజాసభ విజయవంతం కావడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న బీ ఆర్ఎస్ శ్రేణులు, ప్రజా ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఆందోళన చెందుతూ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు మీరు, ముందుగా తెరాస అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గానికి నూతనంగా మంజూరు అయిన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మెట్ పల్లి లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరు కాగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ జూవ్వాడి నర్సింగరావు, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ లు పాల్గొన్నారు.
👉ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ..
కల్వకుంట్ల కవిత టిఆర్ఎస్ పార్టీపై, టిఆర్ఎస్ హయాంలో సిద్దిపేటలో జరిగిన అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు, నీటి ప్రాజెక్టుల నిర్మాణ కుంభకోణాలు, తదితర అంశాలపై ఆమె ముందస్తు చేసిన ఆరోపణ గూర్చి ముందుగా సమాధానం చెప్పాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ టిఆర్ఎస్ శ్రేణులను డిమాండ్ చేశారు.
