👉 జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ! J.SURENDER KUMAR, ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ నిబంధనలు పాటిస్తూ…

సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో శ్రీవారు !
👉 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను… J SURENDER KUMAR, శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శుక్రవారం ఉదయం శ్రీ మలయప్పస్వామి సింహ వాహనంపై యోగనరసింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. 👉 సింహ వాహనం – ధైర్యసిద్ధి ! శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు. వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు, సివిఎస్వో మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 👉 భక్తులకు మెరుగైన వైద్య సేవలు !…

హంస వాహనంపై శ్రీవారి సేవ !
J.SURENDER KUMAR, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు గురువారం రాత్రి శ్రీమలయప్పస్వామివారు ( శ్రీవారు) సరస్వతి అలంకారంలో వీణ ధరించి హంస వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను పరవశం చేశారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 👉 హంస వాహనం – బ్రహ్మపద ప్రాప్తి హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచిక. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.కాగా, బ్రహ్మోత్సవాలలో మూడో రోజైన శుక్రవారం ఉదయం 8 గంటలకు సింహవాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనసేవలు జరుగుతాయి. ఈ వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలో మెట్రో రైలు సేవలు సీఎం రేవంత్ రెడ్డి !
J SURENDER KUMAR, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలను విస్తరించేందుకు, ఇప్పుడున్న మొదటి దశ మెట్రోను స్వాధీనం…

ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభిస్తాం !
👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ! J.SURENDER KUMAR, వచ్చే విద్యా సంవత్సరం నుంచి తమిళనాడు అనుసరిస్తున్న తరహాలోనే తెలంగాణలోని ప్రభుత్వ…

చండీయాగంలో పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు !
J SURENDER KUMAR, భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మంత్రి శ్రీధర్ బాబు స్వగ్రామం ధన్వాడ శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ…

పేదవాని సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం !
👉 మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ! J.SURENDER KUMAR, గురువారం కాటారం మండల కేంద్రంలోని బిఎల్ఎం గార్డెన్స్ లో గృహ…

అభివృద్ధి పనులకు భూమి పూజలు చేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR, నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి మండలం రాయపట్నం, దోనూర్ గ్రామాలలో ₹ 44 లక్షల అభివృద్ధి పనులకు గురువారం రాష్ట్ర…

యూనివర్సిటీ లో ₹ 20 కోట్లతో విద్యార్థులకు వసతి గృహాలు !
👉 మంత్రులు లక్ష్మణ్ కుమార్, ప్రభాకర్ గౌడ్ ! J SUREDER KUMAR, శాతవాహన యూనివర్సిటీ లో 20 కోట్ల రూపాయల…

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు !
J.SURENDER KUMAR, శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.ముందుగా శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. టీటీడీ చైర్మన్, ఈవో లు ముఖ్యమంత్రి కి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా 2026 ఏడాది టిటిడి డైరీలు, క్యాలెండర్లను గౌరవ ముఖ్యమంత్రివర్యులు ఆవిష్కరించారు. అనంతరం ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి స్వామి వారి పెద్దశేష వాహన సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు టిటిడి బోర్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులలో జేఈవో వీరబ్రహ్మం, ఎస్పీ సుబ్బారాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. 👉 వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం ! శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధవారం సాయంత్రం 5.43 నుండి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం.ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, కంకణ బట్టర్ వేణుగోపాల దీక్షితులు, ఇతర బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.