భాగవత సప్తహం లో మంత్రి లక్ష్మణ్ కుమార్ !

👉 మంత్రికి  ఆశీస్సులు అందించిన
. ప్రముఖ ప్రవచకులు సామవేదం షణ్ముఖ శర్మ !

J SURENDER KUMAR,

ధర్మపురి క్షేత్రంలో ప్రముఖ ప్రవచకులు సామవేదం షణ్ముఖ శర్మ చే శ్రీమద్భాగవత కథా మహాయజ్ఞం సప్తాహం ప్రవచన కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

మున్సిపల్ ఎన్నికలలో డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా మంత్రి లక్ష్మణ్ కుమార్, సోమవారం 1, 2, 3 వార్డులలో స్వయంగా ఓటర్లను కలిసి ఓట్లు  అభ్యర్థించారు. 

ఈ నేపథ్యంలో  ఇదే వార్డు పరిధిలో జరుగుతున్న భాగవత సప్తాహం కార్యక్రమం మంత్రి పాల్గొన్నారు.

👉 మంత్రికి సామవేద షణ్ముఖ శర్మ ఆశీస్సులు !

ప్రముఖ ప్రవచకులు సామవేదం షణ్ముఖ శర్మ , మంత్రి లక్ష్మణ్ కుమార్ కు శాలువా కప్పి ఘనంగా ఆశీర్వదించారు. స్వర్గీయ శివరామ శర్మ , తనయుడు, చంద్రశేఖర్ శర్మ ,  ప్రవచకులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి, మధు గౌతమ్ శర్మ    కోరిడే రఘునాథ్ శర్మ, తదితరులు ఉన్నారు.