👉 మాజీ మంత్రి జీవన్ రెడ్డి ,
J.SURENDER KUMAR,
కెసిఆర్ ను అందరూ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అనే పిలుస్తారు, కానీ కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత అంటాను, ఆయన ఆలోచన కార్యదీక్షత తో తెలంగాణ రాష్ట్రం కార్యరూపకత దాల్చిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండలంలో ముఖ్య కార్యకర్తలతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడారు.

👉 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా ఫలాలు మన పార్టీ కార్యకర్తకు అందలేదు, ఒకవైపు కార్యకర్తల హక్కులు కాపాడలేకపోయాను, నేను మానసిక క్షోభను అనుభవించాల్సిన, అధికార పార్టీ అండదండలు ఏవైతే ఉన్నాయో వేరే ఎవరో వచ్చి అనుభవిస్తుంటే నేను సహించలేకపోయాను అన్నారు.
👉 20 మాసాల నుంచి ఓపిక పడుతున్నాను, మొన్నటి మున్సిపల్ ఎన్నికలలో వారి ఆగడాలు పరాకాష్టకు చేరుకున్నాయి అన్నారు.
👉 నాకు పదవి ఆకాంక్ష ఉన్నట్టయితే ఓపిక పట్టే వాడిని కావచ్చు కానీ నాకు పదవి కంటే ఆత్మ అభిమానం ముఖ్యం నా ఆత్మ అభిమానం కోల్పోయినప్పుడు నాకు గౌరవం దక్కనప్పుడు నాకు పదవి ఎందుకు అని జీవన్ రెడ్డి అన్నారు.
👉 మనం ఎప్పుడైతే అనిచివేతకు గురవుతామో అప్పటి నుండే పోరాటం మొదలుపెట్టాలి మన అవమానాలు ఎప్పుడు మొదలవుతాయో అప్పుడే ఎదుర్కోవాలి పదవి ముఖ్యం కాదు ప్రజల పక్షాన ఉండాలని నేను బయటకు రావడం జరిగింది అన్నారు.
👉 సర్పంచ్ చెక్ పవర్ వారి దగ్గర లేదు, ఎంపీవో అఫిస్ లో ఉన్నాయి అవి సర్పంచ్ లకు ఇప్పివ్వండి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తుంది గతంలో చేసిన అభివృద్ధి పనులే తప్ప ఈ రెండు సంవత్సరాల్లో ఏమైనా అభివృద్ధి పనులు చేశారా ? జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
👉 కెసిఆర్ ఊరు ఊరుకి వైకుంఠధామాలు కట్టించారు, గ్రామం పరిశుభ్రంగా ఉండాలని ఆర్థిక భారమైనప్పటికీ ప్రతి గ్రామపంచాయతీకి ఒక టాక్టర్ కొనిచ్చిన ఘనత కేసిఆర్ గారిది అన్నారు.

👉 డంపింగ్ యార్డ్ లు కూడా కేసీఆర్ ఆలోచనలే
పల్లెలు పచ్చగా ఉండాలని ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని క్రీడ మైదానాలు ఏర్పాటు చేశారు అని జీవన్ రెడ్డి అన్నారు.
👉 హరితహారం అనేది కేసీఆర్ దూరదృస్టి రేవంత్ రెడ్డి 90 రోజుల ప్రణాళిక అన్నాడు 90 రోజులు ఏం చేశారు ? సరైన సూచనలు చేయలేదు లెక్కలు రాసుకోవాలా, బిల్లులు ఎత్తుకోవాలి రాజకీయ విధానాల వల్ల కేసీఆర్ ఒక దిక్కు నేనొక దిక్కు అయినాము నేనెప్పుడూ కేసీఆర్ గురించి వ్యక్తిగతంగా విమర్శ చేయలేదు
👉 రోళ్ళ వాగు కట్ట పునర్నిర్మాణం చేయాలని ఉద్యమం చేశాను, ప్రాణహిత నది జలాలు తుమ్మడిహెట్టి వద్ద కట్టాలని నేను కూడా అన్నాను మన రోళ్ల వాగు కొట్టుకపోయినట్టు మెడిగడ్డ వద్ద రెండు పిల్లల్ని కొట్టుకుపోయాయి అన్నారు.
👉 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత టన్నెల్ తవ్వేటప్పుడు 8 మంది కార్మికులు చనిపోయారు, వారి శవాల వెలికితీత ఇంకా పూర్తి కాలేదు మరి పనులు కొనసాగిస్తున్నారు కదా ? మేడిగడ్డ రెండు పిల్లర్లు బాగు చేస్తే సరిపోతుంది కదా అని అన్నారు.
👉 ఎంతసేపు కేసీఆర్ ను దోషిగా చూపెట్టాలి, రాజకీయ లబ్ధి పొందాలని అనే ఆలోచన తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనం గురించి ఆలోచన చేయాలి కదా మేడిగడ్డ పునర్నిర్మాణం కాలేదు మరి కరువు వస్తే ఎలా ? అని ప్రశ్నించారు
👉 మెడిగడ్డ పునర్నిర్మాణ పనులు చేయనట్లయితే రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అవుతుంది దానికి బాధ్యత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి భరించాలి
👉 రోళ్ల వాగుకు షట్టర్ పెట్టలేదు మేడిగడ్డ పునర్నిర్మాణం కావాలి అంటే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావాలి అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి జనంలో కాంగ్రెస్ పోవాలి టిఆర్ఎస్ రావాలి అనే ఆలోచన వచ్చింది అని జీవన్ రెడ్డి ఆరోపించారు.
