రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత !

👉 అరైవ్ అలైవ్ కార్యక్రమంలో..

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ‌!

J.SURENDER KUMAR,

రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరు బాధ్యత అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ  సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం కేంద్రంలో బుధవారం  నిర్వహించిన “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ……

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు పలు సూచనలు చేశారు. గ్రామంలోకి వచ్చే వాహనాలకు హెల్మెట్ ధరిస్తేనే లోపటికి అనుమతించాలని ఈ విధంగా ప్రతి గ్రామపంచాయతీలో తీర్మానం చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ సూచించారు.

👉 రాష్ట్రంలో నిత్యం రోడ్డు ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని వాటిని నివారించడానికి అవగాహన ద్వారానే సాధ్యమని భావించిన రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి , ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో “అలైవ్ – అలైవ్” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి వివరించారు.

👉 ప్రతి పౌరుడు బాధ్యతగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మంత్రి సూచించారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వారు ఇద్దరు హెల్మెట్ ధరించాలని మంత్రి అన్నారు. కార్లలో ప్రయాణిస్తున్న వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని నిర్ణీత వేగాన్ని మించి వాహనాలను నడపవద్దని మంత్రి సూచించారు.

👉 ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం ద్వారా ప్రాణ నష్టాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాలు ప్రజల భద్రత కోసం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.