👉 ధర్మపురి మున్సిపల్ కు ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తా !
J.SURENDER KUMAR,
త్వరలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి ధర్మపురి ఆలయానికి వస్తాను, ధర్మపురి మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కేటాయిస్తానని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి, వైస్ చైర్మన్ ఇందారపు రామయ్య, కౌన్సిల్ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, నియోజకవర్గ నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుముల లావణ్య లక్ష్మణ్, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మర్యాద పూర్వకంగా సీఎం ను కలిశారు.

ఈ సందర్భంగా ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో 15 వార్డుల్లో 15 మంది కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించినందుకు మంత్రి లక్ష్మణ్ కుమార్ తో పాటు కౌన్సిల్ సభ్యులను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
సంక్షేమం పథకాలు పేద ప్రజలకు అందే విధంగా కష్టపడాలని,అభివృద్ధి విషయంలో తాను అండగా ఉంటామని రేవంత్ రెడ్డి చైర్ పర్సన్ వైస్ చైర్మన్ కు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు సీఎంను కలిశారు.
