మంత్రి లక్ష్మణ్ కుమార్ కు పాస్ పోర్ట్  జారీ చేయండి !


👉 తెలంగాణ హైకోర్టు ఆదేశాలు !

J SURENDER KUMAR,

రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్ కు పాస్ పోర్ట్ జారీ చేయాలని పాస్ పోర్ట్ జారీ అధికారికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

గత ప్రభుత్వ విధానాలపై, సంక్షేమ పథకాలు, నిరుద్యోగ, ఇతర సమస్యలపై నాడు ప్రతిపక్షంలో ఉన్న మంత్రి లక్ష్మణ్ కుమార్,  ఆందోళన, ధర్నాలు, రాస్తారోకోలు, ఇత్తనాలు ఫ్యాక్టరీ రద్దు కోసం చేపట్టిన తదితర ఆందోళన కార్యక్రమాల నేపథ్యంలో గత టిఆర్ఎస్ ప్రభుత్వం, లక్ష్మణ్ కుమార్ పై పలుకేసులతోపాటు నాన్ బేలేబుల్ క్రిమినల్ కేసులు, నమోదు చేయడంతో పాటు అక్రమ అరెస్టులు, ముందస్తు గృహనిర్బంధాలు చేపట్టింది.

ఈనేపథ్యంలో  పలు పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు పెండింగ్ లో ఉన్న తరుణంలో  పాస్ పోర్ట్ అధికారులు పాస్పోర్ట్ జారీకి నిరాకరించారు.

తనపై రాజకీయపరంగా నమోదైన కేసుల పెండింగ్ లో ఉన్నాయి అంటూ  పాస్పోర్ట్ జారీకి అధికారులు నిరాకరిస్తున్నారని, తన న్యాయవాది ద్వారా మంత్రి లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు.

విచారణ చేపట్టిన హైకోర్టు, ఆయా కింది న్యాయస్థానాలు, జారీ చేసిన నిరభ్యంతరం  ఉత్తర్వులు (N.O.C) పరిగణంలోకి తీసుకొని చట్టప్రకారం, నిబంధనల మేరకు లక్ష్మణ్ కుమార్ కు  పాస్ పోర్ట్ జారీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.