అసెంబ్లీలో సెంట్రల్ హాల్ ఏర్పాటుకు కసరత్తు !

👉  పార్లమెంట్ తరహాలో సభ్యులకు ప్రైవసీ.!

   J.SURENDER KUMAR ,               

పార్లమెంట్ తరహాలో శాసనసభ ప్రాంగణం తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన పనులపై ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  అధికారులకు పలు సూచనలు చేశారు. శాసనసభ ప్రాంగణంలో చేపట్టాల్సిన పనులపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్  గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి ముఖ్యమంత్రి  సమీక్ష నిర్వహించారు.

👉 సభ్యుల గౌరవం పెంచేదిగా ప్రాంగణంలో అవసరమైన మార్పులు చేయాలని ముఖ్యమంత్రి  అధికారులకు పలు ఆదేశాలిచ్చారు. సమావేశాలు జరుగుతున్న సమయంలో సభ్యులకు ప్రైవసీ ఉండాలని చెప్పారు. గతంలో నిర్ణయించిన మేరకు పార్లమెంట్ తరహాలో సభ్యులకు సెంట్రల్ హాలును వచ్చే సమావేశాల నాటికి సిద్ధం చేయాలని ఆదేశించారు.

👉 సభ్యుల కోసం ప్రత్యేకంగా మెంబర్స్ క్లబ్ ఒకటి ఏర్పాటు చేయాలని, ప్రస్తుత శాసనసభ, పాత మండలి భవనాల వారసత్వ సంపదకు ఎలాంటి నష్టం జరక్కుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

👉 సభ్యుల కోసం ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్, క్రీడల కోసం అవసరమైన ఏర్పాట్లు ఉండాలని సూచించారు. శాసనసభ ప్రాంగణంలో భద్రతను కూడా మరింత పటిష్టం చేయాలని పలు సూచనలు చేశారు.