J.SURENDER KUMAR,
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన అజారుద్దీన్ , కోదండరాం తో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారి చాంబర్‌లో సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు.
మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ , ప్రొఫెసర్ కోదండరాం శాసనమండలి సభ్యులుగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , డాక్టర్ వివేక్ వెంకటస్వామి , మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ , ఎంపీ వేం నరేందర్ రెడ్డి , ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
