సీఎం రేవంత్ రెడ్డి నేటి పర్యటన వివరాలు !

👉 జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో !

J.SURENDER KUMAR,

రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి సోమవారం ( 20 న)  జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించ నున్నారు.

👉 ఆదివారం సీఎం ఓ కార్యాలయం  జారీ పర్యటన ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయి..

మధ్యాహ్నం 1.45 గంటలకు నివాసం నుంచి బయలుదేరి 2.00 గంటలకు బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు.

👉 హెలికాప్టర్ ద్వారా 3.00 గంటలకు కాలేశ్వరం ఆలయానికి చేరుకుంటారు.


👉 3.05 నుండి 3.25 గంటల మధ్య శ్రీ కాలేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం చేసి, ఆలయంలో భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు.

👉 3.30 గంటలకు కాలేశ్వరం నుంచి బయలుదేరి 3.45 గంటలకు మహాదేవపూర్ మండలం మేడిగడ్డకు చేరుకుంటారు.

👉 3.45 నుండి 4.30 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ ప్రాంతాన్ని పరిశీలిస్తారు.

👉 4.35 నుండి 5.30 గంటల వరకు అంబట్‌పల్లి గెస్ట్ హౌస్‌లో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

👉  5.35 నుండి 6.00 గంటల వరకు మీడియా సమావేశంలో పాల్గొంటారు.

👉 6.00 గంటలకు మేడిగడ్డ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 6.30 గంటలకు కాటారం మండలం నస్తూరపల్లి గ్రామానికి చేరుకుంటారు.

👉  6.30 నుండి 7.45 గంటల వరకు  రైతు భరోసా పథకం రెండో విడత నిధులను విడుదల చేస్తారు.

👉 7.45 గంటలకు నస్తూరపల్లి నుంచి బయలుదేరి రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకుంటారు.