👉మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రజా పాలన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
నూతనంగా ఎన్నికైన ధర్మపురి పట్టణ ముస్లిం కమ్యూనిటీ అధ్యక్షుడు మొహమ్మద్ షబ్బీర్, కమ్యూనిటీ సభ్యులు ( “సదర్” )ఆదివారం రాత్రి మంత్రి లక్ష్మణ్ కుమార్ క్యాంపు కార్యాల మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ షబ్బీర్‌ను శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు, సమాజ అభివృద్ధికి, మైనారిటీ సంక్షేమానికి కృషి చేయాలని మంత్రి కమ్యూనిటీ అధ్యక్షుడికి సూచించారు.

ప్రభుత్వం మైనారిటీల అభ్యున్నతికి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, వాటిని ప్రజలకు చేరువ చేయడంలో కమ్యూనిటీ నాయకులు కీలక పాత్ర పోషించాలని మంత్రి అన్నారు.
మొహమ్మద్ షబ్బీర్ “సదర్” మాట్లాడుతూ, తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ముస్లిం సమాజ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంగనభట్ల దినేష్, ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల రాజేష్, ముస్లిం మత పెద్దలు, పాల్గొన్నారు.
