👉 సీబీఐకి లేఖ రాయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు !
J . SURENDER KUMAR,
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ కోసం న్యాయ నిపుణుల సూచనల మేరకు తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ సీబీఐకి లేఖ రాయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు. అవసరమైతే ఈ విషయంలో సీబీఐ డైరెక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకుని నేరుగా వినతిపత్రం అందించాలని మంత్రులకు సూచించారు.
👉 కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇటీవల హైకోర్టు తీర్పు నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయ నిపుణులు అభిషేక్ సింఘ్వీతో చర్చించి ప్రభుత్వం అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికను నిర్దేశించారు.
👉 పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటును, కమిషన్ ఇచ్చిన నివేదికను హైకోర్టు తప్పు పట్టలేదని, అవన్నీ చెల్లుబాటులో ఉన్నాయని న్యాయ నిపుణులు వివరించారు. కాళేశ్వరం అంశంపై ప్రస్తుతం ఏ కోర్టులోనూ ఎలాంటి కేసు పెండింగ్‌లో లేదని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు. అందువల్ల సీబీఐ విచారణ చేపట్టేందుకు చట్టపరమైన అడ్డంకులు లేవని అభిప్రాయపడ్డారు.
👉 మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సుప్రీంకోర్టు న్యాయ నిపుణులు అభిషేక్ సింఘ్వీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటి పారుదల శాఖ ఈఎన్సీ శ్రీధర్ , సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
