👉 మా ప్రజా ప్రభుత్వంలో దేవాలయాల అభివృద్ధి కి పెద్దపీట !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
అందరి సహకారంతో ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని మాస్టర్ ప్లాన్ అమల్లోకి తీసుకురావాలి అని, ప్రభుత్వం అధికార యంత్రాంగం కృషి చేస్తున్నదని
మా ప్రజా ప్రభుత్వంలో దేవాలయాల అభివృద్ధి కి పెద్దపీట వేస్తున్నదని, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగలు మరియు ట్రాన్స్ జెండర్ సాధికారిత సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కార్మిక & గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ ఎం.హనుమంతరావు , కలెక్టర్ బి. సత్యప్రసాద్ , ప్రముఖ ప్రవచకులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి, దేవాదాయ శాఖ వైదిక సలహాదారు గోవిందుల హరి తో కలిసి మంగళవారం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వేదమంత్రాలతో ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందించారు.

అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాలను, మాడ వీధులను, కోనేరు మరియు దేవస్థానం ఆవరణాలను, మాస్టర్ ప్లాన్ అమలు తీరును పరిశీలించారు.
అనంతరం ఆలయ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ (PPT) ద్వార చేయవలసిన పనులు అలాగే నిర్ధాశించిన లక్ష్యాలు అమలు పరిచాల్సిన పనులకు దిశ నిర్దేశం చేశారు.
👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ……

2027 లో నిర్వహించే గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఏలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
👉 ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో ఆలయాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంలోని భాగంగా గోదావరి తీరం వెంట ఉన్న పలు ఆలయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారని వివరించారు.
👉 గోదావరి తీరంలో ఉన్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం మాస్టర్ ప్లాన్, టెంపుల్ సిటీ పనులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రారంభించారని వివరించారు. బాసరలోని సరస్వతి అమ్మవారు కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి
ఆలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు ధర్మపురి లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అలాగే రాష్ట్రం లోని ఆలయాలను ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిపారు.

👉 ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ అమలుతో పాటు, టెంపుల్ సిటీ నిర్మాణ పనులకు ప్రణాళికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు తోపాటు పలువురు అధికారులు కలిసి మాస్టర్ ప్లాన్ అమలు తీరును పరిశీలించి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారని ఈ సందర్భంగా వివరించారు.
👉 ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి ప్రజల నుంచి సహకారం కావాలని కోరారు. పట్టణంలోని అన్ని వర్గాల ప్రజల సహకారంతో ధర్మపురి క్షేత్ర మాస్టర్ ప్లాన్ అమలతో పాటు టెంపుల్ సిటీ నిర్మాణ పనులు చేస్తామని వివరించారు.
👉 మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ….

ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలోని ఆలయాలను అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని అన్నారు. అందులో భాగంగానే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడంతో వారు సానుకూలంగా స్పందించి ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంను టెంపుల్ సిటీగా తీర్చిదిద్దడానికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారని అన్నారు.
ధర్మపురి ప్రజల కల నెరవేర్చందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ధర్మపురి పుణ్యక్షేత్రం దాదాపు 1400 సంవత్సరాల పురాతన పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రానికి తెలంగాణ రాష్ట్రం నుండి కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున వస్తారని అందువల్ల ఈ ఆలయంను అభివృద్ధి పరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం టెంపుల్ సిటీ ఏర్పడితే ధర్మపురి ప్రాంతం టూరిజం తో పాటు ధర్మపురి పట్టణం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. అదేవిధంగా ప్రజా ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) బి. రాజ గౌడ్, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంగనభట్ల దినేష్, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ నాగలక్ష్మి, సంబంధిత జిల్లా స్థాయి అధికారులు, శ్రీ లక్ష్మీనరసింహ టెంపుల్ ఈవో, మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో, ఎంపీడీవో, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
