కేటీఆర్ సోదరి కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పు!

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

టిఆర్ఎస్ ను, ప్రజలు నమ్మడం లేదనే అసూయతోనే ,మా ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్ నీకు పౌరుషం ఉంటే ముందుగా మీ సోదరి కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఎస్సీ, ఎస్టీ ,దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కేటీఆర్ ను సవాల్ చేశారు.

ధర్మపురి మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం స్వర్గీయ స్పీకర్ శ్రీపాదరావు వర్ధంతి కార్యక్రమం జరిగిన అనంతరం మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియాతో ముచ్చటించారు..

మేం తప్పు చేస్తే ఆధారాలతో సహా నిరూపించండి…దోచుకో, దాచుకో, పంచుకో అనే పదానికే నిదర్శనం బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు అన్నారు. దోచుకో..దాచుకో అనేది బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం అని మంత్రి అన్నారు

దోచుకో..దాచుకో అనే పదానికి పేటెంట్ దారుడు మాజీ మంత్రి కేటీఆర్ అని, 2029 లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుంది. మంత్రి లక్ష్మణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.