కృష్ణ శిలలతో ధర్మపురి ఆలయ నిర్మాణ పనులు !

👉 నిఘా నీడలో కొనసాగుతున్న ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు..!

👉 మాట తప్పని మంత్రి  లక్ష్మణ్ కుమార్..!


J.SURENDER KUMAR,


ప్రముఖ పుణ్యక్షేత్రమైన  ధర్మపురి శ్రీ ఉగ్రనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. క్షేత్ర వాసుల అభిప్రాయాల మేరకు కృష్ణ శిలలతోనే  ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నట్టు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి  అడ్డూరి లక్ష్మణ్ కుమార్  భక్తులకు ఇచ్చిన హామీని అక్షరాల నిజం చేస్తూ ఆ శిలలతోనే నిర్మాణ పనులు చేస్తున్నారు.

👉 స్థానికులకు వేద పండితులకు ఇచ్చిన హామీ మేరకు…!

ప్రజాభిప్రాయ సేకరణ ( ఫైల్ ఫోటో)

శ్రీ ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు కొన్ని నెలల ముందు ఆలయ ప్రాంగణంలో మంత్రి లక్ష్మణ్ కుమార్, దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, స్థపతి తదితర ప్రముఖులు స్థానిక వేద పండితుల, అర్చకుల భక్తుల అభిప్రాయాలను ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సేకరించారు వారి సలహాలు సూచనలు పరిగణంలోకి తీసుకున్నారు.


👉 ఉప ముఖ్యమంత్రి తో.. భూమి పూజ..!

ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి లక్ష్మణ్ కుమార్ భూమి పూజ(ఫైల్ ఫోటో)


పునర్నిర్మాణ పనుల భూమి పూజకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ను ప్రత్యేకంగా ఆహ్వానించి వేద పండితులు అర్చకుల సమక్షంలో భూమి పూజ చేశారు.


👉 శృంగేరి పీఠానికి….


మంత్రి లక్ష్మణ్ కుమార్,  దేవాదాయ కమిషనర్, స్టపతి, ఆలయ కార్యనిర్వహణాధికారి, అర్చక వేద పండితుల బృందం తో ప్రత్యేకంగా శ్రీ శ్రీ శ్రీ  జగద్గురువులు  శృంగేరి పీఠానికి వెళ్లి పునర్నిర్మాణ పనుల ప్లానింగ్, వాస్తు తదితర వివరాలు స్వామీజీకి వివరించి ఆలయంలో జరగనున్న కుంభాభిషేకానికి  రావలసిందిగా ప్రభుత్వ పక్షాన మంత్రి శ్రీ స్వామీజీని ఆహ్వానించారు.

గోదావరి పుష్కరాల నాటికి పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. సంప్రదాయ శిల్పకళ ఉట్టి పడేలా కష్ణ శిలతో పురాతన ఆలయ వైభవాన్ని కాపాడుతూ ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారు.


👉 ₹ 10  కోట్ల రూపాయల నిధులతో..

మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవతో  రాష్ట్ర ప్రభుత్వం ₹ 10 కోట్ల నిధులను మంజూరు కేటాయించడంతో పనులు కార్యరూపం దాల్చాయి. రానున్న 2027 గోదావరి పుష్కరాల నాటికి నిర్మాణ పనులను పూర్తి చేయాలని దేవా దాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

👉 26 రాతి పిల్లర్లతో నిర్మాణం..!

ఆలయ నిర్మాణంలో భాగంగా 26 రాతి  పిల్లర్లను
ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం బేస్మెంంట్ స్థాయి వరకు పనులు పూర్తయ్యాయి.

👉 మూల విగ్రహానికి మూడు అంచెలా రక్షణ కవచం !

పునర్నిర్మాణ పనులలో అనుక్షణం అప్రమత్తంగా చేస్తున్న పనులలో చిన్న పొరపాటుతో చిన్న రాయి, మట్టి పడకుండా  శ్రీ ఉగ్ర నరసింహ స్వామి వారి మూల విగ్రహం చుట్టూ కర్రతో, ఇనుప రాడ్ లతో, మందమైన రేకులతో పకడ్బందీ రక్షణ కవచం ముందస్తుగా ఏర్పాటు చేసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.

👉  ఏపీ గుట్టల నుండి కృష్ణ శిలలు….!

కృష్ణా జిల్లా అల్లగడ్డ సమీపంలోని గుట్టల్లో అపురూ
పంగా లభ్యమయ్యే ఈ రాతి ఆలయాల నిర్మాణానికి వినియోగిస్తున్నారు. వేలాది క్యూబిక్ మీటర్ల రాయి,  ప్రత్యేక వాహనంలో చేరుతున్నాయి.. గ్రానైట్తో పాటు కృష్ణ శిల రాతి నిర్మాణా నికి అవసరమైన నైపుణ్యం, శిల్పకళకు
ప్రాధాన్యం ఇస్తున్నారు.2027 జులైలో గోదావరి పుష్కరాలు జరుగుతుండగా, మే వరకు పనులు పూర్తి

👉 నిఘా నీడలో నిర్మాణ పనులు ..!

నిర్మాణ పనుల పురోగతిపై రాష్ట్ర దేవా దాయశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందు కోసం నిర్మాణ స్థలం వద్ద నాలుగు సీసీ కెమె రాలను ఏర్పాటు చేశారు. వీటిని ఆన్లైన్  లో అనుసంధానం చేశారు.  ప్రతిరోజు పనుల పురోగతిని మంత్రి లక్ష్మణ్ కుమార్ కార్యాలయం,  దేవాదాయశాఖ కమి షనర్ హనుమంతరావు, వైదిక సలహాదారులు గోవిందుల హరి, ప్రసాద్, చీఫ్ ఇంజి నీర్ దుర్గా ప్రసాద్, ఈఈ రాజేష్ నిత్యం పర్యవేక్షిస్తూ సలహాలు సూచనలు ఇస్తున్నారు.


ధర్మపురికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశమున్న నేప థ్యంలో.. పుష్కరాల సమయానికి ఆలయాన్ని రెండు నెలల ముందే అందుబాటులోకి తీసు కుని రావాలని ప్రభుత్వం భావిస్తున్నది..