ప్రభుత్వ పాఠశాలలలో విద్యను బలోపేతం చెద్దాం !

👉వేసవి సెలవుల్లో పాఠశాల మరమ్మత్తు పనులు పూర్తి చేయండి.!

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ధర్మపురి నియోజకవర్గ విద్యాశాఖ సమీక్షలో !

J.SURENDER KUMAR,

ప్రభుత్వ పాఠశాలలో విద్య బలోపేతానికి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. ధర్మపురి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పై జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో మంత్రి లక్ష్మణ్ కుమార్  కలెక్టర్ సత్య ప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి సమీక్ష  నిర్వహించారు.

ధర్మపురి బుగ్గారం వెలగటూర్ ఎండపల్లి గొల్లపల్లి ఎగడపల్లి మండలాల ఎంఈఓ లు కొన్ని పాఠశాలలో మరమ్మతులు, అదనపు గదుల నిర్మాణం టాయిలెట్స్, తాగునీటి వసతి మౌలిక సదుపాయాల గూర్చి మంత్రికి వివరించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ…

రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి , ప్రభుత్వం ముందుకు సాగుతున్నారని అన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని మంత్రి కోరారు.


👉 నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక నిధులు తీసుకువస్తానని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ప్రాథమిక అవసరాలను గుర్తించి నివేదికలు తయారు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.


👉 ప్రస్తుతం వేసవి సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తిరిగి తరగతులు ప్రారంభమయ్యే నాటికి పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు.


👉 గ్రామీణ ప్రాంతాల్లో కూలీ పని, ఇతర వ్యవసాయ పనులు చేసుకునేవారు తమ పిల్లల్ని పాఠశాలకు పంపే సమయంలో ఉదయం పూట టిఫిన్ చేసే పరిస్థితి లేదని గమనించిన ముఖ్యమంత్రి  ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అల్పాహారం అందించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.


👉 ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అల్పాహార వసతి పై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెరిగే విధంగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.